VIDEO: ఇండియా-శ్రీలంక మ్యాచ్‌లో ఎవరూ గమనించని ఫన్నీ మూమెంట్స్‌!

శ్రీలంకను టీమిండియా చిత్తుగా ఓడించి.. వరల్డ్‌ కప్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల మధ్య అలాగే క్రికెట్‌ ఫ్యాన్స్‌తో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంకను టీమిండియా చిత్తుగా ఓడించి.. వరల్డ్‌ కప్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల మధ్య అలాగే క్రికెట్‌ ఫ్యాన్స్‌తో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో అత్యంత భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రోహిత్‌ సేన సగర్వంగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచిన టీమిండియా.. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక లంకతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోయిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న లంక.. ఇన్నింగ్స్‌ రెండో బంతికే సూపర్‌ ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అవుట్‌ చేసి మంచి స్టార్ట్‌ అందుకుంది. అయితే.. ఈ సంతోషం లంకకు ఎంతో సేపు నిలువలేదు.

వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్‌ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌ చేస్తూ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి.. భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇద్దరు హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకుని.. సెంచరీలకు చాలా దగ్గరగా వచ్చి అవుట్‌ అయ్యారు. గిల్‌ 92, కోహ్లీ 88 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. వీరిద్దరు సెట్‌ చేసిన సూపర్‌ ప్లాట్‌ఫామ్‌పై శ్రేయస్‌ అయ్యర్‌ మంచి భారీ స్కోర్‌ లాంటి బిల్డింగ్‌ కట్టేశాడు. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన అయ్యర్‌.. సిక్సులతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ, అతను కూడా 82 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. అయ్యర్‌ సైతం సెంచరీ పూర్తి చేసుకోకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది. మొత్తానికి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి టీమిండియా 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

358 పరుగులు కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు టీమిండియా పేస్‌ త్రిమూర్తులు వణికించారు. బుమ్రా, సిరాజ్‌, షమీ దెబ్బకు లంక కేవలం 55 పరుగులకే కుప్పకూలి.. దారుణ ఓటమిని చవిచూసింది. అయితే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గిల్‌ కోహ్లీ మధ్య, అలాగే కోహ్లీ బౌలింగ్‌ వేయాలని ఫ్యాన్స్‌ పట్టుబట్టడం, మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, షమీ ఫ్యాన్స్‌తో ముచ్చటిచ్చడం.. ఇలా క్రికెట్‌ అభిమానులకు వినోదాన్ని అందించే చాలా అంశాలే చోటు చేసుకున్నాయి. అవన్ని కిందున్న వీడియో ఉన్నాయి. మీరూ చూసి.. వాటిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments