Jasprit Bumrah: వీడియో: టీమిండియా స్టార్‌ బుమ్రాకు షాకిచ్చిన అంపైర్‌! మ్యాచ్‌ ముగిసిన తర్వాత..

Jasprit Bumrah, IND vs ENG, Semi Final, T20 World Cup 2024: ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత బుమ్రాకు ఊహించని షాక్‌ తగిలింది. మ్యాచ్‌లో చివరి వికెట్‌ తీసిన బుమ్రాకు ఎదురైన ఘటన చూసి.. పాపం అనాల్సిందే. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah, IND vs ENG, Semi Final, T20 World Cup 2024: ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత బుమ్రాకు ఊహించని షాక్‌ తగిలింది. మ్యాచ్‌లో చివరి వికెట్‌ తీసిన బుమ్రాకు ఎదురైన ఘటన చూసి.. పాపం అనాల్సిందే. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. గురువారం గయానా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 68 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ కొట్టి.. సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం సౌతాఫ్రికాతో టీమిండియా టైటిల్‌ కోసం పోటీ పడనుంది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు.. బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ మ్యాజిక్‌ చేయడంతో టీమిండియాకు విజయం సులువైంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన ఓటమికి.. రోహిత్‌ సేన బదులు తీర్చుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌ ముగిశాకా.. ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 103 పరుగులకే ఆలౌట్‌ చేశారు. చివరి వికెట్‌ను టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తీశాడు. 17వ ఓవర్‌ 4వ బంతికి జోఫ్రా ఆర్చర్‌ లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ అయ్యాడు. చివరి వికెట్‌ పడిపోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంబురాలు జరుపుకుని.. అంపైర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. బుమ్రా కూడా అందరితో పాటు అంపైర్‌ వద్దకు వచ్చాడు. చేయి చాపి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోయాడు.. అంపైర్‌ మాత్రం మిగతా అందరు ప్లేయర్లకు షేక్‌ హ్యాండ్‌ ఇస్తున్నాడు కానీ బుమ్రాకు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో.. అలాగే షాకై చూస్తున్నాడు. కొద్ది సేపటి తర్వాత షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 57 పరుగులు, సూర్యకుమార్‌ యాదవ్‌ 36 బంతుల్లో 47 పరుగులు చేసి రాణించారు. హార్ధిక్‌ పాండ్యా 13 బంతుల్లో 23 రన్స్‌ చేసి పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్దాన్‌ 3 వికెట్లు సాధించాడు. ఇక 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్‌ అయింది. హ్యారీ బ్రూక్‌ 25, కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 23, జోఫ్రా ఆర్చర్‌ 21 పరుగులతో కొంచెం పోరాటం చేశారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ మూడేసి వికెట్లతో అదరగొట్టారు. జస్ప్రీత్‌ బుమ్రా రెండు వికెట్లు సాధించాడు. మరి మ్యాచ్‌ తర్వాత బుమ్రాను అంపైర్‌ పట్టించుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments