SNP
Tim Seifert Super Catch: పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఒక సూపర్ క్యాచ్ చోటు చేసుకుంది. అయితే.. ఆ క్యాచ్‌కు ప్రేక్షకులతో పాటు ఫీల్డ్ అంపైర్ కూడా ఇంప్రెస్ అయ్యాడు. అక్కడితో ఆగకుండా చప్పట్లతో అతన్ని అభినందించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Tim Seifert Super Catch: పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఒక సూపర్ క్యాచ్ చోటు చేసుకుంది. అయితే.. ఆ క్యాచ్‌కు ప్రేక్షకులతో పాటు ఫీల్డ్ అంపైర్ కూడా ఇంప్రెస్ అయ్యాడు. అక్కడితో ఆగకుండా చప్పట్లతో అతన్ని అభినందించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్‌లో కొన్ని సార్లు అద్భుతమైన క్యాచ్‌లు చూస్తూనే ఉంటాం. అవి చూసినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో ఆ ఫీల్డర్‌ను అభినందించడం కామన్.. కానీ, అదే మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్న ఫీల్డ్ అంపైర్ క్యాచ్‌లకు ఫిదా అవ్వడం మాత్రం జరగలేదు. ఒక వేళ వాళ్లకు క్యాచ్ సూపర్ అనిపించినా.. అంపైర్‌గా ఉండటంతో వారు తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటారు. కానీ, తాజాగా ఓ అంపైర్ మాత్రం ఓ అద్భుతమైన క్యాచ్ చూసి తాను అదే మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్నానే విషయం మర్చి.. చప్పట్లు కొట్టి ముందు క్యాచ్‌ను అభినందించి, ఆ తర్వాత తన అంపైరింగ్ ధర్మాన్ని పాటిస్తూ.. అవుట్ ఇచ్చాడు. ఆ సూపర్ క్యాచ్, అంపైర్ వైరల్ రియాక్షన్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో చోటు చేసుకున్నాయి.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024లో భాగంగా గురువారం కరాచీ కింగ్స్, క్వాట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కరాచీ వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కరాచీ బౌలర్ హసన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ నాలుగో బంతిని క్వాట్టా గ్లాడియేటర్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బాల్ ఎడ్జ్ తీసుకుని.. లెగ్‌సైడ్ దూసుకెళ్లింది. ఆ బాల్‌ను గాల్లోకి పక్షిలా దూకుతూ.. టిమ్ సీఫెర్ట్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి.. క్రికెట్ అభిమానులే కాదు, ఏకంగా ఫీల్డ్ అంపైర్ కూడా ఫిదా అయిపోయాడు. అవుట్ ఇవ్వడం మానేసి.. చప్పట్లు కొడుతూ టిమ్ సీఫెర్ట్‌ను అభినందించాడు. అంపైర్ చప్పట్లు కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. విన్సీ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో అన్వర్ అలీ 14 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులతో 25 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3, అకిల్ హోసెన్ 2, ఉస్మాన్ తారిఖ్ 2, వసీమ్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన క్వాట్టా గ్లాడియేటర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన సమయంలో రుథర్‌ఫర్డ్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. తొలుత ఓపెనర్ జెసన్ రాయ్ 52 పరుగులతో రాణించాడు. రూథర్‌ఫర్డ్ 31 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సులతో 58 పరుగులు చేసి గ్లాడియేటర్స్‌ను గెలిపించాడు. మరి ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫెర్ట్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌తో పాటు అంపైర్ చప్పట్లు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Super Seifert 🦸♂️ #KKvQG #PSL2024
(via @thePSLt20) pic.twitter.com/4JzP40WIcH
— ESPNcricinfo (@ESPNcricinfo) February 29, 2024