Nidhan
అండర్-19 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత యువ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకుంది.
అండర్-19 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత యువ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకుంది.
Nidhan
భారత యువ జట్టు అండర్-19 ప్రపంచ కప్‌లో అదరగొడుతోంది. వరుస విజయాలు సాధిస్తూ దుమ్మురేపుతోంది. మన కుర్రాళ్ల జోరును అడ్డుకోవడం ఇతర జట్ల వల్ల కావడం లేదు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అండర్-19 వరల్డ్ కప్‌లో ఫుల్ డామినేట్ చేస్తున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మనోళ్లు చెలరేగిపోతున్నారు. దీంతో భారత్‌తో మ్యాచ్ అంటేనే అపోజిషన్స్ టీమ్ వణికిపోతున్నాయి. మెగాటోర్నీలో గ్రూప్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అద్భుత విజయాలు సాధించిన యంగ్ ఇండియా.. సూపర్ సిక్స్‌లోనూ బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 214 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. తద్వారా అండర్-19 వరల్డ్ కప్ హిస్టరీలో ఏ టీమ్‌కూ సాధ్యం కాని ఒక రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.
అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచుల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో నెగ్గిన ఫస్ట్ టీమ్‌గా యువ భారత్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో వరుసగా విజయాలు సాధిస్తున్న భారత్.. గత మూడు మ్యాచుల్లోనూ భారీ తేడాతో నెగ్గింది. జనవరి 25న ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో నెగ్గింది యంగ్ ఇండియా. ఆ తర్వాత యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో కూడా 201 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 214 పరుగుల తేడాతో నెగ్గి అరుదైన రికార్డును తమ అకౌంట్లో వేసుకుంది. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఒక జట్టు వరుసగా మూడు మ్యాచుల్లో 200 అంతకంటే పరుగుల తేడాతో నెగ్గడం ఇదే ఫస్ట్ టైమ్.
ఇక, మెగాటోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న యంగ్ ఇండియా అనధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈసారి వరల్డ్ కప్‌లో భారత్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సూపర్ సిక్స్‌లో భాగంగా తదుపరి మ్యాచ్‌లో నేపాల్ (ఫిబ్రవరి 2)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే సెమీస్ బెర్త్ అధికారికంగా కన్ఫర్మ్ అవుతుంది. కాగా, ఈ టోర్నీలో యంగ్ ఇండియా తరఫున అందరు ఆటగాళ్లు అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. అందుకే భారీ తేడాతో టీమ్ విజయాలు సాధిస్తోంది. ఈ టోర్నీలో ముషీర్ ఖాన్ (325 పరుగులు) టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో అతడు 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ బాదాడు. బౌలింగ్ విభాగంలో సౌమీ పాండే (12 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. మరి.. అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టు పెర్ఫార్మెన్స్పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.