iDreamPost
android-app
ios-app

ప్రేయసిని పెళ్లాడిన CSK బౌలర్.. పిక్స్ వైరల్

  • Published Dec 22, 2023 | 7:59 PM Updated Updated Dec 22, 2023 | 7:59 PM

ఈ ఏడాది సినీ సెలబ్రిటీలే కాదూ.. టీమిండియా క్రికెటర్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, బౌలర్ అక్షర్ పటేల్.. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. ఇప్పుడు మరో క్రికెటర్ వివాహం చేసుకున్నాడు.

ఈ ఏడాది సినీ సెలబ్రిటీలే కాదూ.. టీమిండియా క్రికెటర్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, బౌలర్ అక్షర్ పటేల్.. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. ఇప్పుడు మరో క్రికెటర్ వివాహం చేసుకున్నాడు.

  • Published Dec 22, 2023 | 7:59 PMUpdated Dec 22, 2023 | 7:59 PM
ప్రేయసిని పెళ్లాడిన CSK బౌలర్.. పిక్స్ వైరల్

‘ పెళ్లికి భాజా మోగింది’ అంటూ పాటలు పాడుతున్నారు సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు. ఇటీవల అనేక మంది సినీ సెలబ్రిటీలు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. అలాగే టీమిండియాలోని క్రికెటర్స్ నివాసాల్లో వెడ్డింగ్ బెల్స్ మోగాయి. ఈ  ఏడాది టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. అనిల్ కపూర్ తనయ, నటి అతియా శెట్టి మెడలో మూడుముళ్లు వేశాడు. ఆ తర్వాత మరో క్రికెటర్, బౌలర్ అక్షర్ పటేల్ వివాహం జరిగింది. అలాగే ముంబయి క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్, పాస్ట్ బౌలర్ నవదీప్ షైనీ కూడా వివాహ బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఏడాది చివరిలో మరో క్రికెటర్ ఓ ఇంటివాడయ్యాడు.

చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్ పాండే వివాహం ముంబయిలో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు నభా గడ్డంవర్‌తో ఏడడుగులు వేశాడు తుషార్. వీరిద్దరూ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు. స్కూల్ డేస్ నుండి మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఈ జూన్ నెలలో ఎంగేజ్ మెంట్ చేసుకుంది ఈ జంట. ఇప్పుడు మరాఠా సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు క్రికెటర్లు హాజరైనట్లు తెలుస్తోంది. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు తుషార్. ‘ఎక్స్చేంజ్ హార్ట్స్ ఇన్ ఫర్ ఎ న్యూ స్టార్ట్’ అంటూ పిక్స్ పోస్టు చేశాడు. ఈ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ నూతన జంటకు క్రికెటర్స్‌తో పాటు పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. చెన్సై సూపర్ కింగ్స్ కూడా ఇన్ స్టాలో ఈ క్యూట్ కపుల్స్‌కు కంగ్రాట్స్ చెప్పింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున తుషార్ దేశ్‌పాండే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఫైనల్లో కూడా తన బౌలింగ్ ప్రతిభను కనబర్చి.. చెన్నై ఛాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్రను పోషించాడు తుషార్ దేశ్‌పాండే. ఈ ఫోటోలు మీరు చూసి శుభాకాంక్షలు తెలపండి ఇంకెందుకు ఆలస్యం.

 

View this post on Instagram

 

A post shared by Tushar Deshpande (@tushardeshpande96)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom