iDreamPost
android-app
ios-app

స్కూల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోనున్న CSK స్టార్ క్రికెటర్

  • Author Soma Sekhar Published - 05:07 PM, Tue - 13 June 23
  • Author Soma Sekhar Published - 05:07 PM, Tue - 13 June 23
స్కూల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోనున్న CSK స్టార్ క్రికెటర్

మరికొన్ని రోజుల్లో ఓ టీమిండియా క్రికెటర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. చెన్నై కప్ గెలవడంతో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ ను త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు ఈ స్టార్ క్రికెటర్. సోమవారం బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు టీమిండియా బ్యాటర్ శివమ్ దుబే. మరి ఇంతకి పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

తుషార్ దేశ్ పాండే.. అనామక బౌలర్ గా చెన్నై జట్టులోకి అడుగుపెట్టిన అతడు.. అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ధోని సారథ్యంలోని చెన్నై జట్టు ఐపీఎల్ కప్ కొట్టడంలో తుషార్ దేశ్ పాండేది కీలకమైన పాత్ర. కాగా రూ. 20 లక్షల బేస్ ధరకే చెన్నై తుషార్ ను దక్కించుకుంది. ధోని ఇచ్చిన ధైర్యంతో, సూచనలతో తుషార్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్ లో 16 మ్యాచ్ ల్లో 21 వికెట్లు తీసి అబ్బురపరిచాడు.చెన్నై కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన తుషార్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

తన చిన్ననాటి ఫ్రెండ్, స్కూల్ క్రష్ అయిన నభా గడ్డంవార్ తో సోమవారం ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్కూల్ క్రష్ నుంచి తన భార్యగా ప్రమోషన్ పొందుతున్నందుకు ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చాడు తుషార్. ఈ కొత్త జంటకు టీమిండియా స్టార్ క్రికెటర్స్ సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ లు శుభాకాంక్షలు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Tushar Deshpande (@tushardeshpande96)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş