iDreamPost
android-app
ios-app

Irfan Pathan: టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ ఫఠాన్‌ భార్యపై దారుణమైన ట్రోలింగ్‌! ఎందుకంటే..?

  • Published Feb 08, 2024 | 5:21 PM Updated Updated Feb 08, 2024 | 5:21 PM

ఇర్ఫాన్‌ పఠాన్‌.. క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా మాజీ క్రికెటర్‌గానే కాక, పాకిస్థాన్‌కు తన కౌంటర్లతో బుద్ధి చెప్పే కామెంటేటర్‌గా అందరికి సుపరిచితమే.. అయితే అతని భార్యపై కొంతమంది దారుణమైన ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఎందుకో చూద్దాం..

ఇర్ఫాన్‌ పఠాన్‌.. క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా మాజీ క్రికెటర్‌గానే కాక, పాకిస్థాన్‌కు తన కౌంటర్లతో బుద్ధి చెప్పే కామెంటేటర్‌గా అందరికి సుపరిచితమే.. అయితే అతని భార్యపై కొంతమంది దారుణమైన ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఎందుకో చూద్దాం..

  • Published Feb 08, 2024 | 5:21 PMUpdated Feb 08, 2024 | 5:21 PM
Irfan Pathan: టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ ఫఠాన్‌ భార్యపై దారుణమైన ట్రోలింగ్‌! ఎందుకంటే..?

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌.. ప్రస్తుతం కామెంటేటర్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. అలాగే అతని అన్న, భారత మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌తో కలిసి క్యాప్‌(క్రికెట్‌ అకాడమీ ఆఫ్‌ పఠాన్స్‌)ని కూడా నిర్వహిస్తున్నాడు. టీమిండియాకు ఆడుతున్న సమయంలో అన్నదమ్ములిద్దరూ స్టార్‌ క్రికెటర్లుగా వెలుగొందారు. టెస్టు క్రికెట్‌లో హ్యాట్రిక్‌ తీసుకున్న బౌలర్‌గా ఇర్ఫాన్‌ పఠాన్‌కు చెక్కుచెదరని రికార్డ్‌ ఉంది. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కామెంట్రీ చేస్తున్న పఠాన్‌.. సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటాడు. తన ఫొటోలతో పాటు, కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే పఠాన్‌ తన భార్యతో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. ఆ ఫొటోతో పాపం.. ఇర్ఫాన్‌ భార్య దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

నాలుగు రోజుల క్రితం ఇర్ఫాన్‌ పఠాన్‌ తన భార్య సఫా బెగ్‌తో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. వారిద్దరికి వివాహం జరిగిన 8వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా హ్యాపీ యానివర్సీ చెబుతూ.. తన భార్యకు శుభాకాంక్షలు తెలిపాడు పఠాన్‌. అయితే.. ఈ ఫొటోలో పఠాన్‌ భార్య సఫా బుర్ఖా ధరించి లేదు. ఫేస్‌ రివీల్‌ చేయడంపై కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు వదిలేశావా? బేషర్మి ముబారక్‌ అంటూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

పఠాన్‌ కుటుంబం సాంప్రదాయలను చాలా కఠినంగా పాటిస్తుంది. ఇస్లాం ప్రకారం.. ఒక స్త్రీ తన భార్త, తండ్రికి తప్పే మరెవరికి తన ముఖాన్ని చూపించకూడదు. కానీ, ఈ ఫొటోలో సఫా తన ముఖాన్ని దాచుకోకుండా ఉండటంతో ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. అయితే.. ఆమె ఇలా ముఖం చూపిస్తూ ఫొటో దిగడం ఇదే మొదటి సారి. అలాగే యూసుఫ్‌ పఠాన్‌ తన భార్యతో ఫొటో దిగినా.. ఆమె బుర్ఖా ధరించే ఉంటుంది. కానీ, తొలి సారి ఇర్ఫాన్‌ పఠాన్‌ భార్య సఫా ముఖం చూపించడంతో తనపై కొంతమంది ఇలా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobetjojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomgrandpashabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabet