iDreamPost
android-app
ios-app

శ్రేయస్‌ ఇన్‌.. చాహల్‌ ఔట్‌! ధనశ్రీ వర్మపై దారుణమైన ట్రోలింగ్‌!

  • Published Aug 23, 2023 | 10:54 AM Updated Updated Aug 23, 2023 | 10:54 AM
  • Published Aug 23, 2023 | 10:54 AMUpdated Aug 23, 2023 | 10:54 AM
శ్రేయస్‌ ఇన్‌.. చాహల్‌ ఔట్‌! ధనశ్రీ వర్మపై దారుణమైన ట్రోలింగ్‌!

ఆసియా కప్‌ 2023 కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేయకపోవడంపై చెలరేగిన వివాదం ఇంకా చల్లారలేదు. తనను ఎంపిక చేయకపోవడంపై చాహల్‌ స్పందిస్తూ.. మబ్బుల చాటు సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడంటూ వేదాంత ధోరణిలో స్పందించాడు. ఈ విషయంలో చాహల్‌ భార్య ధనశ్రీ వర్మ సైతం చాలా సెటైరికల్‌గా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలో ‘చెప్పినట్లు వింటూ మొహమాటస్థుడిగా ఉంటే మన కెరీర్ ఎదుగుదలకు నష్టం జరుగుతుందా? లేదంటే మనందరం కూడా ఉత్సాహంగా మారిపోయి, మాటకారి తనంతో జీవితంలో ఎదగడం నేర్చుకోవాలా? అని చాలా సీరియస్‌గా ఆలోచించడం స్టార్ట్‌ చేశా’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్టు చాహల్‌కు ఆసియా కప్‌ టీమ్‌లో చోటు దక్కకపోవడంతోనే పెట్టిందని భావిస్తున్నారు.

తన భర్తకు టీమిండియాలో స్థానం దక్కలేదని బాధలో ఉన్న ధనశ్రీ వర్మపై కొంతమంది తమ అత్యంత నీచంగా ట్రోలింగ్‌కు దిగారు. ధనశ్రీ వర్మ.. టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో చాలా క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. చాహల్‌ను మోసం చేస్తూ.. ఆమె శ్రేయస్‌తో ప్రేమలో ఉందంటూ గతంలో కూడా ప్రచారం జరిగింది. చాహల్‌-ధనశ్రీ వర్మ విడాకులు కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, వాటికి చాహల్‌-ధనశ్రీ దంపతులు ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపేయాలంటూ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అయినా కొంతమంది ఇంకా వారి బుద్ధి మార్చుకోవడం లేదు.

ఇంకా ధనశ్రీ వర్మకు శ్రేయస్‌ అయ్యర్‌కు లింక్‌ పెడుతూ.. ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. చాహల్‌కు టీమిండియాలో చోటు దక్కకపోయినా.. నీ లవర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఎంపికయ్యాడు కదా అంటూ జుగుప్సాకరమైన పోస్టులు చేస్తున్నారు. చాహల్‌ టీమ్‌ నుంచి ఔట్‌ అయినా.. శ్రేయస్‌ ఇన్‌ అయ్యాడులే అంటూ డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో రెచ్చిపోతున్నారు. సోషల్‌ మీడియాలో ధనశ్రీ వర్మపై జరుగుతున్న దారుణమైన ట్రోలింగ్‌పై కొంతమంది తిప్పికొడుతున్నారు. అయినా కానీ ట్రోలింగ్‌కి పాల్పడుతున్న వారు ఏ మాత్రం వెనక్కితగ్గడం లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విషాదం.. కేన్సర్‌తో దిగ్గజ క్రికెటర్‌ మృతి

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş