వీడియో: సింగిల్‌ హ్యాండ్‌తో కళ్లు చెదిరే క్యాచ్‌! వావ్‌ అనుకుండా ఉండలేరు..

Trent Boult Stunning Catch: క్రికెట్‌లో క్యాచ్‌లు పట్టడం సర్వసాధారణం. కానీ కొన్ని క్యాచ్‌లు చూస్తే వావ్‌ అనిపిస్తుంది. అలాంటి అనేక క్యాచ్‌ల్లో ఈ క్యాచ్‌ కూడా ఒకటిగా నిలుస్తుంది. ఈ క్యాచ్‌ చూసిన ఎవరైనా సరే వావ్‌ అనాల్సిందే. అలాంటి క్యాచ్‌ ఎవరు పట్టారు ఎంత అద్భుతంగా పట్టారో ఇప్పుడు చూద్దాం..

Trent Boult Stunning Catch: క్రికెట్‌లో క్యాచ్‌లు పట్టడం సర్వసాధారణం. కానీ కొన్ని క్యాచ్‌లు చూస్తే వావ్‌ అనిపిస్తుంది. అలాంటి అనేక క్యాచ్‌ల్లో ఈ క్యాచ్‌ కూడా ఒకటిగా నిలుస్తుంది. ఈ క్యాచ్‌ చూసిన ఎవరైనా సరే వావ్‌ అనాల్సిందే. అలాంటి క్యాచ్‌ ఎవరు పట్టారు ఎంత అద్భుతంగా పట్టారో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌లో కొన్ని క్యాచ్‌లు చూడ్డానికి అద్భుతంగా ఉంటాయి. అబ్బ.. ఏం పట్టాడురా అనిపిస్తుంది కొన్ని క్యాచ్‌లు చూస్తే. కానీ, కొన్ని క్యాచ్‌లు అయితే నమ్మశక్యం కాని రేంజ్‌లో ఉంటాయి. అసలు అలా ఎలా పట్టాడు అనిపిస్తోంది. ఒకసారి కళ్లు రుద్దుని మరీ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని క్యాచ్‌లు చూస్తే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్యాచ్‌ కూడా అలాంటి కళ్లు చెదిరే క్యాచే. వెనక్కి పరిగెడుతూ.. క్యాచ్‌ అందుకోసం సాధారణ విషయం కాదు. అలా పట్టే క్యాచ్‌లన్నీ హైలెటే.. అలా వెనక్కి పరిగెడుతూ.. సింగిల్‌ హ్యాండ్‌తో సెన్సేషనల్‌ క్యాచ్‌ అందుకున్నాడు ట్రెంట్‌ బౌల్ట్‌. ఈ న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌.. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఆడుతున్న విషయం తెలిసిందే.

ఎంఐ ఎమిరేట్స్‌ తరఫున ఆడుతున్న బౌల్ట్‌.. ఆదివారం అబుదాబి నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్‌ ఈ సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌ బౌలర్‌ షజల్‌ ఫారూఖీ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ మూడో బంతికి.. నైట్‌ రైడర్స్‌ బ్యాటర్‌ లారీ ఎవాన్స్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. లాంగ్‌ ఆఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న బౌల్ట్‌ వెనక్కి పరిగెడుతూ.. ఆ బాల్‌ను సింగిల్‌ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. దీంతో లారీ ఎవాన్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. బౌల్ట్‌ పట్టిన ఆ క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అబుదాబి నైట్‌ రైడర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌ మిచెల్‌ పెప్పర్‌ 38, అలీషాన్‌ 37, సమ్‌ హైన్‌ 40, ఆండ్రీ రస్సెల్‌ 46 పరుగులతో రాణించారు. ఎంఐ బౌలర్లలో బౌల్ట్‌ ఒకటి, ఫారూఖీ 3, వకార్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

ఇక 189 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎంఐ.. 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌ కుసల్‌ పెరీరా 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 56, మరో ఓపెనర్‌ మొహమ్మద్‌ వసీమ్‌ 61 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 87 పరుగులోత నాటౌట్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 33 రన్స్‌తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. టిమ్‌ డేవిడ్‌ 10 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. నైట్‌ రైడర్స్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లే, అలీ ఖాన్‌ చెరో వికెట్‌ తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments