IPL 2024: మళ్లీ ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ? దిగ్గజ కోచ్ ఏమన్నాడంటే?

పాండ్యా కెప్టెన్సీలో తొలి మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది ముంబై. దీంతో కెప్టెన్సీ మార్పుపై చర్చలు మెుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమించనున్నారు అన్న వార్తలు వైరల్ గా మారాయి.

పాండ్యా కెప్టెన్సీలో తొలి మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది ముంబై. దీంతో కెప్టెన్సీ మార్పుపై చర్చలు మెుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమించనున్నారు అన్న వార్తలు వైరల్ గా మారాయి.

ఐపీఎల్ 2024 సీజన్ లో షాకింగ్ విషయం ఏమైనా ఉందంటే? అది ఒక్క ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పనే చెప్పాలి. ఐదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అందించింది ఎంఐ మేనేజ్ మెంట్. ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇక తాజాగా పాండ్యా కెప్టెన్సీలో తొలి మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది ముంబై. దీంతో కెప్టెన్సీ మార్పుపై చర్చలు మెుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమించనున్నారు అన్న వార్తలు వైరల్ గా మారాయి. ఈ విషయంపై సన్ రైజర్స్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని ముంబై ఇండియన్స్ లోని కొంతమంది ఆటగాళ్లు అంగీకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తొలి మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా రోహిత్ ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ పెట్టడం, స్టార్ పేసర్ బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకుండా తానే బౌలింగ్ వేయడంతో పాండ్యాపై విమర్శలు ఇంకాస్త ఎక్కువైయ్యాయి. ఈ క్రమంలో మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమించాలన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో SRH మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీకి ఇదే ప్రశ్న ఎదురైంది. స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న టామ్ మూడీ సమాధానం ఇస్తూ..

“ఒకవేళ ఇప్పటికిప్పుడు పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించి పగ్గాలను రోహిత్ కు అప్పగిస్తే.. అంతకంటే షాకింగ్ విషయం మరోటి ఉండదు. అయితే ఇంత తక్కువ టైమ్ లో ఇలాంటి నిర్ణయం ఏ ఫ్రాంచైజీ తీసుకోదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే? అలా డెసిషన్ తీసుకుంటే.. అది తొందరపాటు నిర్ణయమే అవుతుంది. కెప్టెన్ నియామకం అనేది జట్టు దీర్ఘకాల ప్రయోజనాల కోసం తీసుకున్నదని గమనించాలి. ఇక పాండ్యా గుజరాత్ కు కెప్టెన్ గా చేసినప్పుడు ఉన్నంత రిలాక్స్ గా ఈ మ్యాచ్ లో కనిపించలేదు” అంటూ పరోక్షంగా రోహిత్ ను సారథి చేసే అవకాశం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు టామ్ మూడీ.

ఇదికూడా చదవండి: ఒకరు అనుకుని మరొకరిని తప్పుగా కొన్న పంజాబ్! ఆ తప్పే అదృష్టం అయ్యింది!

Show comments