BBL 2023-24: నాటౌట్‌ను ఔటిచ్చిన అంపైర్‌! తాగొచ్చావా? అంటూ నెటిజన్స్‌ ఫైర్‌

బిగ్ బాష్ లీగ్ 2023-24లో ఓ ఆసక్తికర సంఘటన నమోదైంది. క్లియర్ గా నాటౌట్ అయిన బ్యాటర్ ను ఔట్ గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.

బిగ్ బాష్ లీగ్ 2023-24లో ఓ ఆసక్తికర సంఘటన నమోదైంది. క్లియర్ గా నాటౌట్ అయిన బ్యాటర్ ను ఔట్ గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని ఆటగాళ్లకు సంబంధించినవి అయితే.. మరికొన్ని ప్రేక్షకులకు సంబంధించినవి ఉంటాయి. ఇక తామేమీ తక్కువ తినలేదన్నట్లు అంపైర్లు సైతం కొన్ని సందర్భాల్లో తమ డెసిషన్స్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 2023-24లో ఓ ఆసక్తికర సంఘటన నమోదైంది. క్లియర్ గా నాటౌట్ అయిన బ్యాటర్ ను ఔట్ గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు అంపైర్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే?

బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా తాజాగా సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ కేంద్ర బిందువుగా నిలిచాడు. సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు మెల్బోర్న్ బౌలర్ ఇమద్ వసీం. క్రిజ్ లో ఉన్న జేమ్స్ విన్సీ వసీం వేసిన బాల్ ను స్ట్రైట్ గా కొట్టాడు. అయితే ఆ బాల్ సరాసరి బౌలర్ ని తాకుతు వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో ఫీల్డర్లు రనౌట్ కోసం అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ కు రిఫర్ చేయగా.. అతడు రిప్లేలో చూడగా.. బాల్ వికెట్లను తాకకముందే బ్యాట్ క్రీజ్ లో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ అనూహ్యంగా నాటౌట్ ను ఔట్ గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో గందరగోళం నెలకొంది. బిగ్ స్క్రీన్ పై ఔట్ అని రావడంతో.. ప్రేక్షకులు సైతం కంగుతిన్నారు.

అయితే వెంటనే రాంగ్ బటన్ నొక్కానని తప్పు తెలుసుకున్న థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో సిడ్నీ బ్యాటర్ ఊపిరిపీల్చుకున్నాడు. కొద్దిసేపు దాక ఏం జరుగుతుందో తెలీక అందరూ తికమకపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు అంపైర్ పై ఫైర్ అవుతున్నారు. తాగొచ్చావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ జట్టు 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి నాటౌట్ ను ఔటిచ్చిన థర్డ్ అంపైర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments