SNP
వరల్డ్ కప్ టోర్నీలో 24 మ్యాచ్‌లు ముగిశాయి. అంటే దాదాపు సగం టోర్నీ పూర్తి అయింది. అయితే.. ఇప్పుడున్న స్టాట్స్ ప్రకారం సెమీస్ చేరే ఆ నాలుగు ఏమో కాస్త క్లారిటీ వస్తోంది. మరి వరల్డ్ కప్ వేటలో ముందుకు వెళ్లే ఆ నాలుగు టీమ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..
వరల్డ్ కప్ టోర్నీలో 24 మ్యాచ్‌లు ముగిశాయి. అంటే దాదాపు సగం టోర్నీ పూర్తి అయింది. అయితే.. ఇప్పుడున్న స్టాట్స్ ప్రకారం సెమీస్ చేరే ఆ నాలుగు ఏమో కాస్త క్లారిటీ వస్తోంది. మరి వరల్డ్ కప్ వేటలో ముందుకు వెళ్లే ఆ నాలుగు టీమ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..
SNP
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో ఇప్పటికే దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. సెమీస్, ఫైనల్ వదిలేస్తే.. మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. గురువారం ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మ్యాచ్‌తో మొత్తం 25 మ్యాచ్‌లు ముగిశాయి. సగం టోర్నీ పూర్తి కావడంతో ఇప్పటికే అన్ని జట్లు ప్రదర్శనలు, బలాబలాలపై అందరికీ పూర్తి అవగాహన వచ్చేసింది. దాదాపు అన్ని జట్లు ఐదేసి మ్యాచ్‌లు ఆడేశాయి. దీంతో సమీ ఫైనల్‌కు చేరే జట్లు ఏమో క్రికెట్ అభిమానులు ఒక అంచనాకు వచ్చేశారు. కానీ, ఇంకా అధికారికంగా ఏ జట్టు కూడా సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోలేదు. అయితే.. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను బట్టీ చూస్తూ.. ఓ నాలుగు టీమ్స్‌కు మిగిలిన జట్ల కంటే మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆ నాలుగు జట్లు ఏమో ఇప్పుడు చూద్దాం..
సెమీస్‌లో తొలి బెర్త్‌ను టీమిండియానే ఖాయం చేసుకునేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 5 మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. ఈ టోర్నీలో ఓటమి ఎదరుగన జట్టు ఏదైనా ఉందా అంటే అది టీమిండియానే. ఐదుకి ఐదు విజయాలతో 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. పైగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ లాంటి పెద్ద టీమ్స్‌ను ఓడించింది రోహిత్ శర్మ. అలాగే ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. తమ రేంజ్ విజయాలను సొంతం చేసుకుంది. రానున్న మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాత్రమే ఇండియాకు పోటీ ఇచ్చేలా కనిపిస్తున్న టీమ్స్. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. ఏ ఒకరిద్దరో ప్లేయర్ల ఆధారపడకపోవడం టీమిండియాకు ఉన్న ప్రధాన బలం.
ఇక సౌతాఫ్రికాకు కూడా సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా కేవలం ఒక్క ఓటమితో 8 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి పెద్ద టీమ్స్‌ను మట్టికరిపించిన సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలై.. ఊహించని ఫలితాన్ని చవిచూసింది. తర్వాత కోలుకుని బంగ్లాదేశ్‌పై తమ స్థాయి విజయాన్ని అందుకుంది. రానున్న మ్యాచ్‌ల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు మినహా ఇతర జట్లు సౌతాఫ్రికాకు పెద్దగా పోటీ ఇవ్వకపోవచ్చు. ఇక న్యూజిలాండ్‌కు సైతం సెమీస్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో తప్పా.. మరె మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడింది. కేన్ విలియమ్సన్ సైతం గాయం నుంచి కోలుకుని టీమ్‌లోకి వస్తే.. కివీస్ మరింత బలపడనుంది.
ఇక ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే.. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓటమి, వెంటనే రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమితో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ను వరుస ఓటములతో ప్రారంభించింది. దీంతో.. ఈ టోర్నీలో ఆసీస్ కనీసం సెమీస్ అయినా చేరుతుందా? అని చాలా మంది భావించారు. కానీ, అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా మూడు వరుస విజయాలతో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. మూడు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ టీమ్‌లోని ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. వరల్డ్ కప్ అంటే ఆసీస్ ఎలా ఆడుతుందో.. ఇప్పుడు అలాగే ఆడుతోంది. దీంతో.. ఆస్ట్రేలియా కూడా సెమీస్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మొత్తంగా.. ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులతో పాటు, క్రికెట్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అయితే.. టోర్నీ ఆరంభానికి ముందు.. హాట్ ఫేవరేట్లుగా ఉన్నా ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు మాత్రం ఫేలవ ప్రదర్శనను కనబరుస్తున్నాయి. ఆరంభంలో నెదర్లాండ్స్, శ్రీలంకపై గెలిచిన పాకిస్థాన్ మంచి ఊపు మీద కనిపించింది. కానీ టీమిండియాతో ఆడిన తర్వాత.. ఆ జట్టు పసికూనలా మారిపోయింది. ఇండియాపై ఓడిన తర్వాత ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. సరే ఆస్ట్రేలియా పెద్ద టీమ్ అని సరిపెట్టుకంటే.. చివరికి ఆఫ్ఘనిస్థాన్ చేతిలోనూ దారుణ ఓటమిని చవిచూసింది. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 3 పరాజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. పాకిస్థాన్‌కు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నా.. అవి ఎంతో సంక్లిష్టంగా ఉన్నాయి. పాకిస్థాన్ దాదాపు సెమీస్ చేరకపోవచ్చు.
ఇక ఇంగ్లండ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. జట్టు నిండా స్టార్లు, ఆల్‌రౌండర్లతో అరివీర భయంకరంగా ఉన్నా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగినా.. ఆ టీమ్ తమ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఇప్పటికే 5 మ్యాచ్‌ల్లో 4 ఓటములతో ఉంది. పైగా నెదర్లాండ్స్ చేతిల్లో ఓడిపోయింది. తాజాగా గురవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ 156 పరుగులకే ఆలౌట్ అయి ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లండ్ సమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే. ఇక బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ కష్టమే అనే విషయం తెలిసిందే. శ్రీలంకకు అవకాశం ఉన్నా.. మిగిలిన జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాలి. మరి ఇప్పటి వరకు జరగిన టోర్నీని పరిశీలించి.. ఏ నాలుగు జట్లు సెమీస్ చేరుతాయని మీరు భావిస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WorldCup2023 #INDIA #SouthAfrica #NewZealand #Australia will reach the semi finals pic.twitter.com/V5cUVbbmZr
— Sayyad Nag Pasha (@nag_pasha) October 26, 2023