iDreamPost
android-app
ios-app

షోయబ్ మాలిక్ మూడో భార్యకు అవమానం! గ్రౌండ్‌లోనే పరువు తీసేశారు!

  • Published Feb 20, 2024 | 5:59 PM Updated Updated Feb 20, 2024 | 5:59 PM

మరో సెలబ్రిటీ జంట విడిపోతున్నట్లు వార్తలు వస్తుండగానే.. మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు ఆ క్రికెటర్. అతడు ఎవరో కాదూ షోయబ్ మాలిక్. ఇండియన్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా.. మాజీ భర్త అయిన ఇతడు.. ఆమెతో విడాకులపై క్లారిటీ ఇవ్వకుండానే.. మూడో వివాహానికి సంబంధించిన ఫోటోలు పెట్టి వార్తల్లో నిలిచాడు.

మరో సెలబ్రిటీ జంట విడిపోతున్నట్లు వార్తలు వస్తుండగానే.. మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు ఆ క్రికెటర్. అతడు ఎవరో కాదూ షోయబ్ మాలిక్. ఇండియన్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా.. మాజీ భర్త అయిన ఇతడు.. ఆమెతో విడాకులపై క్లారిటీ ఇవ్వకుండానే.. మూడో వివాహానికి సంబంధించిన ఫోటోలు పెట్టి వార్తల్లో నిలిచాడు.

  • Published Feb 20, 2024 | 5:59 PMUpdated Feb 20, 2024 | 5:59 PM
షోయబ్ మాలిక్ మూడో భార్యకు అవమానం! గ్రౌండ్‌లోనే పరువు తీసేశారు!

పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్.. ప్రముఖ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జాకు విడాకులు ప్రకటించకుండానే.. మూడో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. సనా జావేద్ అనే నటిని అతడు గత నెలలో వివాహం చేసుకుని.. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. షోయబ్‌కు ఇది మూడవ పెళ్లి కాగా, సనాకు ఇది రెండవ వివాహం. అయితే ఈ పెళ్లిపై ఇండియన్సే కాదూ.. పాకిస్తాన్ లోని  షోయబ్ అభిమానులు సైతం ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదు. ఆమెను వీరిద్దరూ మోసం చేశారంటూ మండిపడుతున్నారు.  సనాతో అతడు రిలేషన్ మెయిన్ టైన్ చేస్తున్నాడని మాజీ భార్యకు తెలిసి.. మ్యూచువల్ కన్సల్ట్ మీద సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఏదేమైనా.. ‘షోెయబ్, సనా పెళ్లి నాటి నుండి ఈ జంటపై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కట్టుకున్న వ్యక్తులను మోసం చేసి.. మరొకరితో సహజీవనం చేస్తూ.. ఆ విషయం బయటకు పొక్కగానే.. బంధాన్ని పవిత్రం చేసుకునేందుకు పెళ్లి చేసుకున్నారని, ఇదో పెద్ద నాటకం అంటూ మండిపడుతున్నారు. కాగా, ఎన్నో విమర్శలు వస్తాయని తెలిసినా కూడా.. రిస్క్ చేసి మరీ సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్‌ను వివాహం చేసుకుందని.. అలాంటి ఆమెను ఎలా మోసం చేయాలని అనుకున్నారు అంటూ ఆ ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్‌కు ఏకంగా చేదు అనుభవమే ఎదురైంది. ఆమెకు నిరసన సెగ తగిలింది. ప్రస్తుతం షోయబ్..కరాచీ కింగ్స్‌కు ఆడుతున్నాడు.

ఈ నేపథ్యంలో తన భర్త ఆటను చూసేందుకు ముల్తాన్ స్టేడియానికి వెళ్లింది. మ్యాచ్ సమయంలో డగౌట్ నుండి సనా వెళుతుండగా.. కొంత మంది ఆమెను టీచ్ చేశారు. సనాను సానియా మీర్జా అంటూ అరిచారు. దీంతో వాళ్ల వైపు కాస్త సీరియస్‪గా చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉండటం వల్లే సానియా, షోయబ్ మాలిక్ బంధం ముగిసిందని భావిస్తున్నారు ప్రేక్షకులు. కాగా,  2010లో హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు సానియా, షోయబ్. అప్పట్లో వీరి వివాహంపై విమర్శలు వచ్చినా.. లెక్క చేయలేదు  జంట.  మాలిక్, సానియా మీర్జాలకు 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు.  ఇంతలో విడాకుల గురించి చెప్పకుండా మూడో పెళ్లి చేసుకున్నాడు మాలిక్.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş