iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ జరుగుతున్న వేళ.. క్రికెట్‌కు టీమిండియా క్రికెటర్ గుడ్ బై!

టీమిండియా యువ క్రికెటర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

టీమిండియా యువ క్రికెటర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

వరల్డ్ కప్ జరుగుతున్న వేళ.. క్రికెట్‌కు టీమిండియా క్రికెటర్ గుడ్ బై!

వన్డే వరల్డ్ కప్ 2023 దిగ్విజయంగా సాగిపోతున్న వేళ టీమిండియా క్రికెటర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా తాను క్రికెట్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు వెల్లడించారు. దీంతో ఆ క్రికెటర్ చేసిన పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది. ఆ భారత ప్లేయర్ మరెవరో కాదు గురుకీరత్ సింగ్ మాన్. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన గురుకీరత్ సింగ్ మాన్.. ఆ జట్టులో కూడా లేకపోవడం.. భారత్ జట్టులో, ఐపిఎల్‌లో అవకాశం రాకపోవడంతో రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గురుకీరత్ సింగ్ మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వ్రాసుకొచ్చాడు.. ‘ఈ రోజు నా అద్భుతమైన క్రికెట్ ప్రయాణానికి చివరి రోజు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవం. నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, కోచ్‌లు మరియు తోటి ఆటగాళ్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కెరీర్‌లో మీరంతా కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాగా గురుకీరత్ సింగ్ మాన్ 2016 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున 3 వన్డే మ్యాచ్‌లు ఆడి అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడమే కాకుండా, గురుకీరత్ సింగ్ మాన్ ఈ మ్యాచ్‌లలో ఆఫ్ స్పిన్నర్‌గా 10 ఓవర్లు కూడా బౌలింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో భారత్ జట్టులో మళ్లీ అవకాశం రాలేదు.

గురుకీరత్ సింగ్ మాన్ వన్డే అరంగేట్రం చేయడానికి ముందు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం జట్టులో చోటుదక్కింది. కానీ అతనికి ఆడే అవకాశం రాలేదు. IPLలో, అతను పంజాబ్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అతను 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడు, కానీ అతను అప్పుడు ఏ మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్‌లో, అతను 41 మ్యాచ్‌లలో 121 స్ట్రైక్ రేట్‌తో 511 పరుగులు చేశాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరఫున మ్యాచ్ ఆడాడు.

 

View this post on Instagram

 

A post shared by Gurkeerat Mann (@gurkeeratmann)