SNP
Virat Kohli, T20 World Cup 2024: ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫామ్ అందర్ని కలవరపెడుతోంది. అయితే.. అతను ఇలా ఆడేందుకు కారణం.. తెర వెనుక జరుగుతున్న ఓ కుట్ర అనే ఆరోపణలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Virat Kohli, T20 World Cup 2024: ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫామ్ అందర్ని కలవరపెడుతోంది. అయితే.. అతను ఇలా ఆడేందుకు కారణం.. తెర వెనుక జరుగుతున్న ఓ కుట్ర అనే ఆరోపణలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని టీమ్‌గా ఉన్న భారత్.. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లోనూ గెలిచి.. సౌతాఫ్రికాతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. అయితే.. ఈ మెగా టోర్నీలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోహ్లీకి ఈ వరల్డ్ కప్ టోర్నీలో రెండు డకౌట్లు ఉన్నాయి. తాజాగా ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనూ తన బ్యాడ్ ఫామ్‌ను కొనసాగించాడు కోహ్లీ. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. నిలకడకు మారుపేరు లాంటి కోహ్లీ.. ఇలా వరుసగా విఫలం కావడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే.. కోహ్లీ ఫెల్యూర్ వెనుక కుట్ర జరుగుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 వరల్డ్ కప్ 2024 కంటే ముందు.. అసలు కోహ్లీకి వరల్డ్ కప్ స్క్వౌడ్‌లో చోటు దక్కుతుందా? లేదా అని అనుమానాలు కూడా తలెత్తాయి. కానీ, ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ అదరగొడుతూ.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలవడంతో.. తప్పని సరి పరిస్థితుల్లో కోహ్లీని టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకున్నారు. రోహిత్ శర్మకు జోడీగా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసినా.. అతన్ని పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేసి.. రోహిత్‌కు జోడీగా కోహ్లీని ఓపెనర్‌గా దింపుతున్నారు. ఈ ప్రయోగం దారుణంగా విఫలం అవుతోంది. పైగా వరుస వైఫల్యాలతో కోహ్లీపై విమర్శలు కూడా పెరిగాయి.. అతన్ని టీమ్ నుంచి తీసేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
సాధారణంగా కాస్త టైమ్ తీసుకుని, పిచ్ కండీషన్‌కు తగ్గట్లు, మంచి బంతులకు రెస్పెక్ట్ ఇస్తూ.. పర్టిక్యులర్ బౌలర్‌ను టార్గెట్ చేసి మరీ కొట్టే కోహ్లీ.. ఈ వరల్డ్ కప్‌లో మాత్రం వేరేలా ఆడుతున్నాడు. తన సహజ శైలికి భిన్నంగా.. గిడ్డెద్దు చేలో పడ్డట్టు.. బ్లైండ్‌గా హిట్టింగ్‌కు దిగుతున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ ఓ సూపర్ సిక్స్‌తో మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ.. తర్వాతి బంతికి అగ్రెసివ్ షాట్ కోసం వెళ్లి.. బంతిని ఏ మాత్రం అంచనా వేయకుండా అవుట్ అయ్యాడు. అయితే.. కోహ్లీ అలా ఆడితేనే అతనికి టీమ్‌లో చోటు ఉంటుందని.. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి కోహ్లీపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. కాస్త టైమ్ తీసుకుని కాకుండా.. ఫస్ట్ బాల్ నుంచి అగ్రెసివ్‌గా ఆడాలని.. కోహ్లీని ప్రెజర్ పెడుతున్నట్లు సమాచారం. ఒక విధంగా కోహ్లీకి లేని భయాన్ని కలిగిస్తున్నట్లు క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli in T20 World Cups:
2012 – Most runs for India
2014 – Player of the Tournament
2016 – Player of the tournament
2022 – Most runs in tournament
2024 – 75 runs in 7 inningsWhere do you think it went wrong for him? pic.twitter.com/6GUQqX4myF
— CricTracker (@Cricketracker) June 27, 2024