iDreamPost
android-app
ios-app

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు యువ ఆటగాడు దూరం.. ఆ యంగ్ ప్లేయర్ కి ఛాన్స్!

భారత్ కు సఫారీలతో టెస్ట్ సిరీస్ కు ముందు వరుస షాక్ లు తగులుతున్నాయి. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా యువ ఆటగాడు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆ యువ ప్లేయర్ కు ఛాన్స్.

భారత్ కు సఫారీలతో టెస్ట్ సిరీస్ కు ముందు వరుస షాక్ లు తగులుతున్నాయి. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా యువ ఆటగాడు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆ యువ ప్లేయర్ కు ఛాన్స్.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు యువ ఆటగాడు దూరం.. ఆ యంగ్ ప్లేయర్ కి ఛాన్స్!

సఫారీలతో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి చేరుకున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్ సిరీస్ లు ఆడనుంది భారత్. సెంచూరియన్ వేదికగా మంగళవారం నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో విజయం సాధించిన టీమిండియా టెస్ట్ సిరీస్ లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరో యంగ్ ప్లేయర్ దూరమయ్యాడు. అతడి ప్లేస్ లో ఆ యంగ్ ప్లేయర్స్ కు చోటు దక్కే అవకాశం ఉంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. సిరీస్ కు ముందే టీమిండియాకు షాక్ లు తగులుతున్నాయి. వన్డే సిరీస్‌లో వేలి గాయానికి గురైన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ వన్డేలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో రుతురాజ్ గైక్వాడ్ కుడి బొటన వేలికి గాయం కాగా ఇంకా కోలుకోలేదు. వేలికి గాయం కావడంతో రుతురాజ్ పూర్తిగా ఫిట్‌గా లేడని బీసీసీఐ తెలిపింది. దీంతో సఫారీలతో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు.

ఇక రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా తప్పుకుంటుండడంతో అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంక దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సిరీస్ విజయమే లక్ష్యంగా దృఢసంకల్పంతో టీమిండియా సన్నదమవుతోంది. ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోలేదు. దాంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని నెంబర్ వన్ టెస్ట్ టీమ్ అయిన టీమిండియా.. సిరీస్ నెగ్గి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌తో పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరి సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి