SNP
IND vs SL, Playing 11: శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా.. టీమిండియా మంగళవారం చివరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
IND vs SL, Playing 11: శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా.. టీమిండియా మంగళవారం చివరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు మంగళవారం చివరి టీ20 మ్యాచ్ ఆడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిసిన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజేతగా నిలిచి.. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక రేపు(మంగళవారం) జరగబోయే చివరి మ్యాచ్‌లోనూ గెలిచి.. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని సూర్య సేన భావిస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ దృష్ట్యా క్లీన్‌స్వీప్ పెద్ద కష్టం కాకపోవచ్చు. కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్య.. క్లీన్ స్వీప్‌పైనే కన్నేశారు. ఇద్దరికి ఇదే తొలి సిరీస్ కావడంతో దీన్ని మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని భావిస్తున్నారు.
ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. ఫలితం వచ్చింది. శ్రీలంక పూర్తిగా 20 ఓవర్లు ఆడగా.. టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభం కాగానే వర్షం రావడంతో.. టీమిండియా టార్గెట్‌ను 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్దేశించారు. ఈ టార్గెట్‌ను 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. ఇక మూడో టీ20 విషయానికి వస్తే.. తొలి రెండు మ్యాచ్‌లు జరిగిన పల్లెకలె మైదానంలో చివరి టీ20 కూడా జరగనుంది. చివరి మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన సిరీస్ కైవసం చేసుకోవడంతో.. ఇక నామమాత్రమైన లాస్ట్ మ్యాచ్‌లో ప్రయోగాలు చేయాలని కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై రెండో మ్యాచ్ తర్వాత గ్రౌండ్‌లోనే ఇద్దరు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లకు చివరి మ్యాచ్‌లో ఛాన్స్ ఇచ్చి.. బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించే అవకాశం ఉంది. సీనియర్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా, సిరాజ్, రియాన్ పరాగ్‌లకు రెస్ట్ ఇచ్చి.. వారి స్థానంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లను ప్లేయింగ్‌లో ఆడించనున్నట్లు సమాచారం. అలాగే మెడనొప్పితో బాధపడుతున్న గిల్ ఎలాగో శ్రీలంకతో వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ ఆడాల్సి ఉండటంతో అతనికి కూడా రెస్ట్ ఇచ్చి.. సంజు శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా)
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషభ్ పంత్, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్.
బెంచ్: హార్ధిక్ పాండ్యా, మొహమ్మద్ సిరాజ్, రియాన్ పరాగ్, శుబ్‌మన్ గిల్.
Shubman Gill Out
Sanju Samson Inn #INDvsSL pic.twitter.com/rJUcpcw28g— Richard Kettleborough (@RichKettle07) July 28, 2024