ఇలా అయితే టీమిండియా కొంపమునిగినట్టే.. టీ20 కప్పు మర్చిపోవాల్సిందే: భారత క్రికెటర్‌

ఇలా అయితే టీమిండియా కొంపమునిగినట్టే.. టీ20 కప్పు మర్చిపోవాల్సిందే: భారత క్రికెటర్‌

Team India, T20 World Cup 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఎంత ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుందో.. అంతకంటే ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారు టీమిండియా మాజీ క్రికెటర్లు. వారి టెన్షన్‌కు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Team India, T20 World Cup 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఎంత ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుందో.. అంతకంటే ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారు టీమిండియా మాజీ క్రికెటర్లు. వారి టెన్షన్‌కు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా క్రికెటర్లంతా ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. కేకేఆర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరడం.. మరో రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే.. ఈ ఐపీఎల్‌ తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌ ఉన్న విషయం తెలిసిందే. జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత టీ20 వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌కు వెళ్లనుంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర​్‌ హర్భజన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం వెళ్లాల్సిన చాలా మంది భారత ఆటగాళ్లు ఇంకా ఐపీఎల​్‌తోనే బిజీగా ఉన్నారని మరో 15 రోజుల్లో వరల్డ్‌ కప్‌లు ప్రారంభం అవుతాయని, ఇలాంటి టైమ్‌లో కూడా టీమ్‌ ఒక్కటిగా కలిసి ఆడలేదని అన్నాడు. కానీ, ఇంగ్లండ్‌ క్రికెటర్లు మాత్రం కోట్ల కొద్ది డబ్బును వదిలిపెట్టి.. దేశం కోసం ఆడేందుకు స్వదేశానికి వెళ్లిపోయారు. టీ20 వరల్డ​ కప్‌ 2024 కోసం రెడీ అయ్యేందుకు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ను వదిలేశారు. వరల్డ్‌ కప్‌ టోర్నీకి ముందు.. టీమ్‌ మొత్తం కలిసి ప్రాక్టీస్‌ చేయడానికి, అలాగే టీ20 సిరీస్‌లో ఆడేందుకు వెళ్లిపోయారు.

కానీ టీమిండియా క్రికెటర్లు మాత్రం పూర్తి ఐపీఎల్‌ ఆడుతున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు టీమిండియా కేవలం రెండే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుంది. టీమ్‌లో కాంబినేషన్స్‌ సెట్‌ చేసుకోవడానికి టీమిండియాకు పెద్ద అవకాశం లేకుండా పోతుంది. అమెరికాలోని పరిస్థితులకు అలవాటు పడేలా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జట్టులోని ఆటగాళ్లంతా కలిసి ఆడితే టీమిండియాకు మేలు జరుగుతుందని, కానీ అది జరిగేలా లేదు. అయితే వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ వంటి టోర్నీల ముందు కనీసం 10-15 రోజుల ముందు నుంచి భారత ఆటగాళ్లంతా కలిసి ఉండటం ఎంతో ముఖ్యం అని హర్భజన్ సింగ్ అన్నాడు. భజ్జీ వ్యాఖ్యల తర్వాత.. అలా అయితే ఈ టీ20 వరల్డ్‌ కప్ కూడా పోయినట్లేనా అని భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments