Mohammed Shami: నా సక్సెస్​ను అతడు ఓర్వలేకపోయాడు.. షమి షాకింగ్ కామెంట్స్!

టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన సక్సెస్​ను అతడు ఓర్వలేకపోయాడని అన్నాడు.

టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన సక్సెస్​ను అతడు ఓర్వలేకపోయాడని అన్నాడు.

భారత బౌలింగ్ యూనిట్ గతంలో ఎన్నడూ లేనంత భీకరంగా ఇప్పుడు తయారైంది. స్పిన్​లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అదరగొడుతుంటే.. మహ్మద్ షమి, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్​లు నిఖార్సయిన పేస్​ బౌలింగ్​తో దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా వెటరన్ పేసర్ షమి అయితే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. గతేడాది సొంతగడ్డ మీద జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో బెస్ట్ బౌలర్​గా నిలిచాడు షమి. బుల్లెట్ వేగంతో అతడు వేసే బౌన్సర్లు, యార్కర్లకు ప్రత్యర్థి బ్యాటర్లు గజగజలాడారు. సీనియర్ పేసర్ రివర్స్ స్వింగ్​కు టాప్ బ్యాటర్స్ దగ్గర కూడా ఆన్సర్ లేకుండా పోయింది. అయితే ప్రపంచ కప్ టైమ్​లో షమి అసాధారణ ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భిన్నమైన బంతులు ఇవ్వడం వల్లే మెగాటోర్నీలో షమి సత్తా చాటాడని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలపై భారత స్టార్ పేసర్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.

హసన్ రాజా తన మీద అసూయతోనే అలా మాట్లాడాడని షమి అన్నాడు. అతడి లాంటి కొందరు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు క్రికెట్​ను జోక్​గా మార్చేశారని ఫైర్ అయ్యాడు. అతడు తన సక్సెస్​ను ఓర్వలేకపోయాడని సీరియస్ అయ్యాడు. ‘హసన్ రాజా వంటి పాక్ మాజీలు క్రికెట్​ను జోక్​గా మార్చారు. వాళ్లు ఒకరి సక్సెస్​ను జీర్ణించుకోలేరు. మెచ్చుకున్నప్పుడు ఏ ప్లేయర్ అయినా సంతోషిస్తాడు. అదే ఓడినప్పుడు మాత్రం మోసపోయామని భావిస్తారు. పూర్తి అసూయతో చేసిన వ్యాఖ్యలు ఇవి’ అని షమి చెప్పుకొచ్చాడు. ఇక, ప్రపంచ కప్​లో టీమిండియా బౌలర్లకు స్పెషల్ బాల్స్ ఇచ్చారని.. అందుకే వాళ్లు చాలా ఈజీగా స్వింగ్, రివర్స్ స్వింగ్ రాబట్టి అనుకూల ఫలితాలు రాబడుతున్నారని అప్పట్లో హసన్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

హసన్ రాజా వ్యాఖ్యలపై అప్పట్లోనే షమి కౌంటర్ ఇచ్చాడు. తాజాగా మరోమారు దీనిపై రియాక్ట్ అయ్యాడు. అతడు తన సక్సెస్​ను ఓర్వలేకపోయాడని చెప్పాడు. కాగా, చీలమండ గాయంతో టీమ్​కు దూరంగా ఉంటున్న షమి.. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సౌతాఫ్రికా టూర్​తో పాటు ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్ మిస్సయ్యాడు. ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు దూరమైన షమి.. ఆఖరి మూడు టెస్టులకైనా అందుబాటులో ఉంటాడని అభిమానులు అనుకున్నారు. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున అతడు నేరుగా ఐపీఎల్​లోనే ఆడతాడని క్రికెట్ వర్గాల సమాచారం. ఇక, ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ.. అతడికి తోడుగా మరో పేసర్ రాణించకపోవడంతో భారత్ ఇబ్బంది పడుతోంది. మరి.. హసన్ రాజా తన సక్సెస్​ను ఓర్వలేకపోయాడంటూ షమి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments