Jitesh Sharma: టీమిండియా యంగ్ క్రికెటర్ జితేష్ శర్మ ఎంగేజ్​మెంట్! పెళ్లి ఎప్పుడంటే?

ఓ టీమిండియా యంగ్ క్రికెటర్​ త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. నిన్న అతడి నిశ్చితార్థ వేడుక జరిగింది. షార్ట్ గ్యాప్​లోనే మంచి పాపులారిటీ సంపాదించిన ఆ ప్లేయర్ ఎవరో తెలుసా?

ఓ టీమిండియా యంగ్ క్రికెటర్​ త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. నిన్న అతడి నిశ్చితార్థ వేడుక జరిగింది. షార్ట్ గ్యాప్​లోనే మంచి పాపులారిటీ సంపాదించిన ఆ ప్లేయర్ ఎవరో తెలుసా?

సెలెబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్​తో పాటు పర్సనల్ లైఫ్​కు సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి ఆడియెన్స్ చూపిస్తుంటారు. వాళ్ల హాబీస్, ఇష్టాఇష్టాలు లాంటివి కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే లవ్ స్టోరీస్, మ్యారేజ్ వంటి టాపిక్స్ మీద కూడా డిస్కస్ చేస్తుంటారు. ముఖ్యంగా సినీ, క్రీడా ప్రముఖుల గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఎవరు ఎవర్ని ప్రేమిస్తున్నారు? ఎవరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు? లాంటివి తెలుసుకోవాలని చాలా మంది అభిమానులు అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఓ క్రికెటర్ ఇప్పుడు ఇంటివాడు కానుండటం వైరల్​గా మారింది. అతడి నిశ్చితార్థ వార్త విని ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు.

పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్న ఆ క్రికెటర్ మరెవరో కాదు.. జితేష్ శర్మ. షార్ట్ గ్యాప్​లోనే మంచి క్రేజ్ సంపాదించిన ఆటగాళ్లలో ఈ టీమిండియా స్టార్ ఒకడు. డొమెస్టిక్ క్రికెట్‌ పెద్దగా ఆడకపోయినా త్వరగానే భారత జట్టులో చోటు సంపాదించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. అలాంటోడు నిన్న ఎంగేజ్​మెంట్ చేసుకున్నాడు. షలక మాకేశ్వర్ అనే అమ్మాయితో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆగస్టు 8వ తేదీన సింపుల్​గా జరిగిన ఈ ఎంగేజ్​మెంట్ ఫంక్షన్​లో అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నట్లు తెలిసింది.

కాబోయే సతీమణి షలకతో నిశ్చితార్థ వేడుకలో దిగిన ఫొటోలను జితేష్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నిన్ననే తన ఎంగేజ్​మెంట్ అయిందని తెలిపాడు. ఈ క్రేజీ వరల్డ్​లో తన పార్ట్​నర్​ను పట్టేశానని చెప్పాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ జితేష్​కు విషెస్ చెబుతున్నారు. ప్రొఫెషనల్ లైఫ్​లోలాగే పర్సనల్ లైఫ్​లోనూ సక్సెస్ అవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎంగేజ్​మెంట్ అయినట్లు తెలిపిన ఈ క్రికెటర్.. పెళ్లి ఎప్పుడో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక, ఆసియా క్రీడలు-2023లో భారత జట్టు తరఫున డెబ్యూ ఇచ్చాడు జితేష్. చివరగా ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్​లో పాల్గొన్నాడు. మొత్తంగా 9 టీ20 మ్యాచుల్లో కలిపి 100 పరుగులు చేశాడు. ఐపీఎల్​లో పంజాబ్ కింగ్స్​కు వైస్ కెప్టెన్​గా ఉన్న ఈ ప్లేయర్.. మంచి పెర్ఫార్మెన్స్​లతో తిరిగి భారత జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Show comments