SNP
Inzamam ul Haq, Arshdeep Singh, IND vs AUS: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్రను పాక్ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు.. అందుకే చీటింగ్ అంటూ చౌకబారు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ సారి అలాంటి కామెంట్ చేసింది దిగ్గజ మాజీ క్రికెటర్ ఇంజుమామ్. ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
Inzamam ul Haq, Arshdeep Singh, IND vs AUS: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్రను పాక్ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు.. అందుకే చీటింగ్ అంటూ చౌకబారు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ సారి అలాంటి కామెంట్ చేసింది దిగ్గజ మాజీ క్రికెటర్ ఇంజుమామ్. ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. పటిష్టమైన ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 చివరి మ్యాచ్‌లో గెలిచి.. సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. గ్రూప్ 1 నుంచి ఇండియాతో పాటే ఆఫ్ఘనిస్థాన్ సెమీస్‌కు వెళ్లింది. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు.. టీమిండియాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ ఇంజుమామ్ ఉల్ హక్ టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. భారత జట్టు బాల్‌ను ఏదో చేస్తోందని.. అంపైర్లు ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించాడు. ఒక విధంగా చెప్పాలంటే.. టీమిండియా చీటింగ్ చేస్తున్నా.. అంపైర్లు పట్టించుకోవడం లేదని అతని ఉద్దేశం.
భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 24న జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఏకంగా 3 వికెట్లు పడగొట్టి.. ఆసీస్ ఓటమిని శాసించాడు. అయితే.. ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన డిబెట్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సలీం మాలిక్, ఇంజుమామ్ ఉల్ హక్ పాల్గొని.. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి విశ్లేషించారు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ చివరి ఓవర్లలో మంచి రివర్స్ సింగ్ రాబట్టడంతోనే టీమిండియా విజయం సులువైందని పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ సలీం మాలిక్ అన్నాడు. సలీం చెబుతుంటే.. మధ్యలో అడ్డుతగిలిన ఇంజుమామ్.. అర్షదీప్ సింగ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో బాల్‌ను రివర్స్ సింగ్ చేశాడు.
అలా చేయాలంటే.. బాల్‌ను 12, 13వ ఓవర్‌లోనే రెడీ చేయాలి. అలా చేస్తుంటే.. అంపైర్లు కాస్త కాళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైన ఉందని ఇంజుమామ్ ఉల్ హక్ అన్నాడు. బాల్‌ను వాళ్లు ఏదో చేస్తున్నారనే డౌట్ ఉందని ఆయన ఆరోపించాడు. దీనికి సలీం కూడా వత్తాసు పలుకుతూ.. కొన్ని టీమ్స్ విషయంలో అంపైర్ల కళ్లు పనిచేయవు.. అందులో టీమిండియా కూడా ఒకటి అని అన్నారు. ఇలా ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో బాల్‌ను పాకిస్థాన్ బౌలర్లు స్వింగ్ చేసి ఉంటే.. పెద్ద చర్చ జరిగేదని ఇంజుమామ్ అన్నాడు. ఆ తర్వాత.. పిచ్ ప్లాట్ ఇంక రఫ్‌గా ఉంది.. బాల్ హార్డ్‌గా హిట్ చేయడంతో కూడా బాల్ రివర్స్ స్వింగ్ అవ్వొచ్చు అని చివర్లో అన్నాడు. మొత్తంగా టీమిండియా యంగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ టాలెంట్‌ను ఒప్పుకొలేక ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భారత క్రికెట్ అభిమానులు ఇంజుమామ్ ఉల్ హక్‌పై మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Inzamam Ul Haq said – “Arshdeep Singh’s balls were swinging, something was done to the ball by India’s in T20 World Cup 2024”.
What’s your take on this 🤔 #INDvsENG #T20WorldCup pic.twitter.com/t0voGwaxaI
— Richard Kettleborough (@RichKettle07) June 26, 2024