SNP
SNP
ప్రస్తుతం టీమిండియా ముందున్న ప్రధాన లక్ష్యం.. అక్టోబర్‌లో మన దేశంలోనే జరిగే వన్డే వరల్డ్ కప్ 2023ను గెలవడం. ఎప్పుడో పుష్కరకాలం క్రితం టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ దాని ముఖం చూడలేదు. అలా అని టీమ్ బాగా లేదా అంటే అదీ కాదు. ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్‌గా ఉంది. కానీ, ఒక్క ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే నిరాశపరుస్తుంది. అయితే.. 2011లో టీమిండియా గెలిచిన వన్డే వరల్డ్ కప్ ఇండియాలోనే జరగడం మళ్లీ ఈ వరల్డ్ కప్ కూడా ఒక్కడే జరుగుతుండటంతో భారత క్రికెట్ అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం టీమిండియా ఎక్కువగా విరాట్ కోహ్లీ, రోహిత్ వర్మపైనే ఆధారపడుతుందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం వెస్టిండీస్ సిరీస్‌లో అదే విషయం స్పష్టంగా తెలుస్తుంది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు ఓ కపిల్ దేవ్ లాంటి ప్లేయర్ అవసరం ఉందని, అలాంటి ఆటగాడు ఉంటే టీమిండియా కప్పు గెలవగలదని కొంతమంది క్రికెట్ అభిమానులు అంటున్నారు. అయితే.. ఈ అభిప్రాయాన్ని స్వయంగా కపిల్ దేవే ఖండించారు. టీమిండియాకు కపిల్ దేవ్ అవసరం లేదని, అయినా ఒక్క కపిల్ దేవ్ ఉంటేనే టీమిండియా వరల్డ్ కప్ గెలవదని అన్నాడు.
ఒక మంచి టీమ్ ఉంటేనే ఏ జట్టైనా వరల్డ్ కప్ నెగ్గుతుందని అన్నారు. అయినా తరం మారేకొద్ది మంచి మంచి క్రికెటర్లు వస్తుంటారని, సునీల్ గవాస్కర్ నుంచి లాంటి ఆటగాడు మళ్లీ పుడతాడా? అని అంతా అనుకున్నారు. కానీ సచిన్ టెండూల్కర్ చాలా సులువుగా అతన్ని అధిగమించేశాడు. అలాగే సచిన్ తర్వాత ఇంకొకరు వస్తారా అనుకుంటే.. ఇప్పుడా ప్లేస్‌లో కోహ్లీ వచ్చి కూర్చున్నాడు అని కపిల్ తెలిపారు. కాగా, కపిల్ 1983లో కెప్టెన్‌గా భారత్‌కు మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో ఆయన ఎంతో అద్భుతంగా రాణించారు. మరి కపిల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బుసలు కొడుతూ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన పాము! నిలిచిన మ్యాచ్