టీమిండియాను చిత్తుగా ఓడించిన శ్రీలంక! ఒక్క తప్పుతో కప్పు పోయింది!

టీమిండియాను చిత్తుగా ఓడించిన శ్రీలంక! ఒక్క తప్పుతో కప్పు పోయింది!

Women's Asia Cup 2024, Final, IND vs SL, Harmanpreet Kaur: శ్రీలంకతో జరిగిన ఉమెన్స్‌ ఆసియా కప్‌ 2024 ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ ఓటమికి ఓ తప్పు కారణమైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Women's Asia Cup 2024, Final, IND vs SL, Harmanpreet Kaur: శ్రీలంకతో జరిగిన ఉమెన్స్‌ ఆసియా కప్‌ 2024 ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ ఓటమికి ఓ తప్పు కారణమైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంక పర్యటనలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20లో విజయంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. కానీ, మరోవైపు భారత మహిళల జట్టు మాత్రం శ్రీలంకపై చిత్తుగా ఓడిపోయింది. అది కూడా ఆసియా కప్‌ 2024 ఫైనల్‌లో ఒకే రోజు ఈ రెండు మ్యాచ్‌లు జరిగాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా తొలుత ఉమెన్స్‌ ఆసియా కప్‌ 2024 ఫైనల్‌లో భారత్‌-శ్రీలంక జట్లు తలపడ్డాయి. సాయంత్రం భారత్‌-శ్రీలంక పురుషుల జట్లు టీ20 సిరీస్‌లో భాగంగా పోటీ పడ్డాయి. ఉమెన్స్‌ క్రికెట్‌లో శ్రీలంక గెలిస్తే.. మెన్స్‌ క్రికెట్‌లో టీమిండియా విజయం సాధించింది.

అయితే.. ఉమెన్స్‌ ఆసియా కప్‌ 2024 ఫైనల్‌లో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చేసిన ఒక తప్పు.. టీమిండియాకు ఆసియా కప్‌ను దూరం చేసింది. 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక 15 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజ్‌లో హర్షిత మాధవి 45, కవిష దిల్హరి 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మంచి షాట్లతో బాగా ఆడుతున్న హర్షిత ఇన్నింగ్స​ 16 ఓవర్‌లో ఇచ్చిన సింపుల్‌ క్యాచ్‌ను టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేలపాలు చేసింది. ఈ క్యాచ్‌ కౌర్‌ పట్టి ఉంటే.. మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ మూడో బంతికి మిడ్‌ ఆఫ్‌ దిశగా గాల్లోకి షాట్‌ ఆడింది.

ఆ షాట్‌ నేరుగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చేతుల్లోకి వెళ్లింది. కానీ, ఆమె ఆ క్యాచ్‌ను జారవిడిచింది. ఆ తర్వాత హర్షిత మరింత చెలరేగి లంకను గెలిపించింది. ఈ విజయంతో శ్రీలంక తొలి సారి ఆసియా కప్‌ను గెలిచింది. ఇండియా ఖాతాలో ఇప్పటికే ఏడు ఆసియా కప్‌లు ఉన్నాయి. 8వ కప్పు కొట్టే అవకాశాన్ని హర్మన్‌ఫ్రీత్‌ కౌర్‌ ఒక్క క్యాచ్‌ మిస్‌తో దూరం చేసుకుంది. ఇ​క మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన 60, వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ 30, జెమియా 29 పరుగులు చేసి రాణించారు. ఇక 166 పరుగుల టార్గెట్‌ను శ్రీలంక 18.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ చరిత ఆటపట్టు 61, హర్షిత 69, కవిష 30 పరుగులతో అదరగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ క్యాచ్‌ మిస్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments