iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ లోకి టీమిండియా స్టార్ క్రికెటర్! ఎవరంటే?

  • Author Soma Sekhar Published - 09:58 PM, Fri - 29 September 23
  • Author Soma Sekhar Published - 09:58 PM, Fri - 29 September 23
బిగ్ బాస్ లోకి టీమిండియా స్టార్ క్రికెటర్! ఎవరంటే?

బుల్లితెరపై ఎన్నో షోలు వచ్చాయి.. వెళ్లాయి. కానీ అందులో కొన్ని షోలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇండియాలో చాలా భాషల్లో ఇది షో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో కూడా ఆరు సీజన్లను పూర్తి చేసుకుని ప్రస్తుతం 7వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ బిగ్ బాస్ హౌస్ లోకి పలు రంగాలకు చెందిన వ్యక్తులు వస్తుంటారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడంట టీమిండియా స్టార్ క్రికెటర్. మరి ఆ క్రికెటర్ ఎవరు? ఈ కథేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ రియాలిటీ షోలోకి క్రికెటర్ రావడం కొత్తేమీ కాదు. గతంలో హిందీ బిగ్ బాస్ లోకి టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో టీమిండియా ఆటగాడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడంట. అతడెవరో కాదు.. భారత మాజీ బౌలర్ వినయ్ కుమార్. అవును మీరు విన్నది నిజమే. టీమిండియా మాజీ బౌలర్ వినయ్ కుమార్ అక్టోబర్ 8 నుంచి మెుదలయ్యే కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 లోకి అడుగుపెడుతున్నాడని సమాచారం. అయితే ఈ వార్త నిజమా? కాదా? అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Team india cricketer into bigg boss

ఇక వినయ్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. టీమిండియా తరఫున 31 వన్డేలు, 9 టీ20లు, ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ లో ముంబై, కోల్ కత్తా, బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిగా 2013లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి.. 2021లో తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో సెకండ్ ఇన్నింగ్స్ మెుదలుపెట్టాలని భావిస్తున్నాడంట వినయ్ కుమార్. ఒకవేళ వినయ్ కుమార్ బిగ్ బాస్ లోకి వస్తే.. ఎలా ఆడతాడనేది చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి