వన్డే ప్రపంచ కప్ 2023 ముంగిట టీమిండియా మరో కీలక టోర్నీ ఆడటానికి సిద్దమైంది. మినీ ప్రపంచ కప్ గా పిలిచే ‘ఆసియా కప్’ రేపు(బుధవారం) ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్-నేపాల్ జట్లు తలపడుతుండగా.. టీమిండియా తన తొలి మ్యాచ్ ను దాయాది పాక్ తో సెప్టెంబర్ 2న పల్లెకెలె స్టేడియంలో ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ ప్రకటన చేశాడు. ఆసియా కప్ లో టీమిండియా నేపాల్, పాకిస్థాన్ తో ఆడే రెండు మ్యాచ్ లకు మిడిలార్డర్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడు అంటూ ద్రవిడ్ ప్రకటించాడు. దీంతో గాయం తగ్గకుండా అతడిని ఆసియా కప్ కు ఎందుకు సెలెక్ట్ చేశారు అంటూ.. తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మీరు సంజూ శాంసన్ కు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
ఆసియా కప్ లో టీమిండియా ఆడే తొలి రెండు మ్యాచ్ లకు మిడిలార్డర్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడు అంటూ హెడ్ కోచ్ ద్రవిడ్ ప్రకటించాడు. దీంతో అతడి గాయం పూర్తిగా తగ్గకముందే ఆసియా కప్ కు ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటూ సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అతడు పూర్తిగా గాయం నుంచి కోలుకున్నాకే టోర్నీకి ఎంపిక చేయాల్సిందని సూచిస్తున్నారు. అతడికి బదులుగా సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకున్నా బాగుండేదని అంటున్నారు. నేపాల్ తో కూడా ఆడలేని వాడిని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు.
శాంసన్ కూడా రాహుల్ లాగే వికెట్ కీపింగ్ తో పాటుగా.. అటు ఓపెనర్, మిడిలార్డర్ బ్యాటర్ గా సత్తా చాటగల ఆటగాడు. అదీకాక కీపింగ్ లో రాహుల్ కంటే ఎక్కువగా డైవ్ చేస్తూ.. క్యాచ్ లు పట్టడం మనం చూసే ఉన్నాం. అయితే రాహుల్ స్థానంలో మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇషాన్ కిషన్ ఓపెనర్ గా ఆడిస్తారా? లేదా మిడిలార్డర్ లో ఆడిస్తారా? లేదా గిల్ ను తప్పిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా.. పాకిస్థాన్ లాంటి పటిష్టమైన జట్టుతో తలపడే ముందు అనుభవం ఉన్న ఆటగాళ్లు అయితేనే ఒత్తిడిని జయించగలుగుతారు.
అయితే కేఎల్ రాహుల్ మాత్రం ప్రాక్టీస్ మ్యాచ్ లో భారీ సిక్సర్లతో చెలరేగుతున్నాడు. అతడి బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతడు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ లోకి వచ్చినట్లే కనబడుతున్నాడు. అయినప్పటికీ అతడికి రెండు మ్యాచ్ ల విరామం దేనికో అర్ధం కావడంలేదని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కేఎల్ రాహుల్ స్థానంలో ఈ రెండు మ్యాచ్ లకు ఎవరి తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
UPDATE
KL Rahul is progressing really well but will not be available for India’s first two matches – against Pakistan and Nepal – of the #AsiaCup2023: Head Coach Rahul Dravid#TeamIndia
— BCCI (@BCCI) August 29, 2023
ఇదికూడా చదవండి: ఆసియా కప్‌లో ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ రద్దవుతుందా?