Nidhan
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనతో పాటు వాళ్లూ తాగుబోతులేనన్నాడు. అసలు ప్రవీణ్ ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనతో పాటు వాళ్లూ తాగుబోతులేనన్నాడు. అసలు ప్రవీణ్ ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
Nidhan
భారత్‌ను బ్యాటర్ల ఫ్యాక్టరీగా పిలుస్తారనేది తెలిసిందే. ఎందుకంటే సునీల్ సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్ వరకు ఎందరో అద్భుతమైన బ్యాటర్లను క్రికెట్‌కు అందించింది ఇండియా. ప్రస్తుత క్రికెట్లోనూ మన జట్టు ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫుల్ డామినేషన్ చూపిస్తున్నారు. అయితే బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్ పరంగానూ క్రికెట్‌కు భారత్ తన కాంట్రిబ్యూషన్‌ను అందించింది. ఎందరో అద్భుతమైన స్పిన్నర్లు, పేసర్లు మన జట్టు తరఫున ఆడుతూ ఆడియెన్స్‌ను అలరించారు. కొంతమంది మీడియం పేసర్లు కూడా టీమిండియా తరఫున ఆడుతూ మంచి ప్రతిభను కనబర్చారు. అందులో ఒకడు ప్రవీణ్ కుమార్. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఈ బౌలర్ కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. టీమిండియా తరఫున వన్డేలు, టెస్టులు, టీ20ల్లో అదరగొడుతూ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి ప్రవీణ్ కుమార్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనతో పాటు వాళ్లూ తాగుబోతులేనన్నాడు.
తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారత జట్టులోని ప్లేయర్లందరికీ ఆల్కహాల్ తాగే అలవాటు ఉండేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు ప్రవీణ్ కుమార్. అయితే ఈ విషయంలో తన ఇమేజ్ను పాడు చేశారన్నాడు. జట్టులోని సీనియర్లు అందరూ మందు తాగొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దంటూ సలహాలు ఇచ్చేవారని.. కానీ వాళ్లు మాత్రం అన్నీ చేసేవారన్నాడు. ‘టీమ్‌లోని అందరికీ తాగే అలవాటు ఉంది. కానీ నన్ను మాత్రమే తాగుబోతుగా చిత్రీకరించారు. నేను మాత్రమే డ్రింక్ చేస్తాడంటూ నా ఇమేజ్ను దెబ్బతీశారు. నా మీద తాగుబోతుననే ముద్ర వేశారు. కానీ గ్రౌండ్లో, డ్రెస్సింగ్ రూమ్‌లో నేనెప్పుడూ మందు బాటిల్ ముట్టలేదు’ అని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. తనను ఎవరు బద్నాం చేశారో అందరికీ తెలుసన్నాడు. కెమెరా ముందు వారి పేరు రివీల్ చేయాలని అనుకోవడం లేదన్నాడు. అయితే తన గురించి వ్యక్తిగతంగా తెలిసినవాళ్లు దీన్ని నమ్మలేదన్నాడు. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్ సైడ్ వెళ్లాలనుకున్నానని.. కానీ అక్కడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రవీణ్ పేర్కొన్నాడు.
డొమెస్టిక్ ప్లేయర్లను గైడ్ చేయాలనుకున్నానని.. కానీ ఆ దిశగా తనకు అవకాశాలు రాలేదన్నాడు ప్రవీణ్ కుమార్. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ మీదా సంచలన ఆరోపణలు చేశాడీ మాజీ పేసర్. అతడు తనను భయపెట్టాడని.. కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడని ప్రవీణ్ తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కాంట్రాక్ట్ మీద సంతకం చేయకపోతే తన కెరీర్‌ను నాశనం చేస్తానని లలిత్ మోడీ బెదిరించాడని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇక, ప్రవీణ్ కెరీర్ విషయానికొస్తే.. టీమిండియా తరఫున అతడు 68 వన్డేలు ఆడి 77 వికెట్లు తీశాడు. 6 టెస్టులు ఆడి 27 వికెట్లు, 10 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించి 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 119 మ్యాచులు ఆడి 90 వికెట్లు తీశాడు. 2018 అక్టోబర్‌లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, టీమ్‌లోని అందరు ప్లేయర్లు తాగుబోతులేనంటూ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మరి.. తనతో ఆడిన సహ క్రికెటర్లను ఉద్దేశించి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: టీ20ల్లో కోహ్లీ-రోహిత్ లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆఫ్ఘాన్‌కు దబిడిదిబిడే..
Shastri can drink in team bus and can coach team
Jadeja can smoke hookaah and still make into the team
MS Dhoni can smoke hukkah in private party
But legendary bowler Praveen Kumar who drink privately cannot coach even a Ranji team.
Double standards of @BCCI pic.twitter.com/OHki8mpz8l
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 7, 2024
Praveen Kumar opens up on the challenges he faced post-retirement. pic.twitter.com/Mray0W1W5t
— OneCricket (@OneCricketApp) January 9, 2024
“When I was in the Indian team, seniors said ‘drink nahi karna, yeh nahi karna, woh nahi karna’. Karte sab hai,” Praveen Kumar claimed.https://t.co/8OSMLKamG9
— Circle of Cricket (@circleofcricket) January 8, 2024