వీడియో: దీపావళి వేడుకలు.. ట్రెడిషనల్‌ లూక్‌లో మెరిసిన భారత క్రికెటర్లు

నెదర్లాండ్స్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌కి ముందు టీమిండియా ఆటగాళ్లంతా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కొంతమంది క్రికెటర్లు సతీసమేతంగా వేడుకలకు హాజరయ్యారు. అయితే.. ఆ వేడుకల్లో కొన్ని హైలెట్స్‌ ఉన్నాయి. ఆవేంటో ఇప్పుడు చూద్దాం..

నెదర్లాండ్స్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌కి ముందు టీమిండియా ఆటగాళ్లంతా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కొంతమంది క్రికెటర్లు సతీసమేతంగా వేడుకలకు హాజరయ్యారు. అయితే.. ఆ వేడుకల్లో కొన్ని హైలెట్స్‌ ఉన్నాయి. ఆవేంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా సెమీస్‌కు చేరింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌ తర్వాత.. 15న న్యూజిలాండ్‌తో భారత జట్టు తొలి సెమీ ఫైనల్‌లో తలపడనుంది. అయితే.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కి జట్టు మొత్తం దీపావళి వేడుకల్లో పాల్గొంది. ఈ వేడుకలకు భారత జట్టులోని సభ్యులంతా భారతీయ సాంప్రదాయ వస్త్రాధారణల్లో రావడం విశేషం. కుర్తా పైజామాలో స్టార్‌ క్రికెటర్లతంతా మెరిసిపోయారు. ముఖ్య​ంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే మొహమ్మద్‌ సిరాజ్‌, మొహమ్మద్‌ షమీ సైతం ఈ వేడుకల్లో ట్రెడిషనల్‌ లుక్‌లో వచ్చి స్పెషల్‌గా నిలిచారు.

నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచ్‌కి ముందు ఇలా టీమిండియా ఆటగాళ్లంతా సరదాగా గడిపిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే.. ఈ వేడకల్లో భాగంగా చివరల్లో గ్రూప్‌ ఫొటోలో టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు ముందు వరుసలో మోకాళ్లపై కూర్చున్న ఫొటో అయితే క్రికెట్‌ అభిమానులు మనసుల గెల్చుకుంది. జట్టులో ఎంత స్నేహపూర్వక వాతావరణం ఉందో చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ అంటూ నెటిజన్లు, భారత క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. సాధారణంగా జూనియర్లు అలా ముందు కూర్చోని, సీనియర్లు వెనకాల నిలబడటం చూస్తుంటాం కానీ, ఇక్కడ మాత్రం ద్రవిడ్‌, రోహిత్‌ ముందు ఉన్నారు.

ఇక వరల్డ్‌ కప్‌ టోర్నీ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌కి ముందు టీమిండియా, నెదర్లాండ్స్‌తో లీగ్‌ మ్యాచ్‌ను ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లా భావిస్తోంది. కాగా, నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కివీస్‌పై భారత జట్టు రికార్డు అంత మంచిగా లేకపోవడం, ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను కాస్త కలవరపెడతోంది. కానీ, ఇప్పుడు టీమిండియా ఉన్న సూపర్‌ ఫామ్‌ను చూస్తే మాత్రం ఈ సారి భారత జట్టను కప్పు కొట్టకుండా ఎవరూ అడ్డుకోలేరని కూడా అనిపిస్తోందంటూ ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు. 15న ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సమీస్‌ పోరు జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments