Rohit Sharma: వీడియో: ఫీల్డింగ్ చేయకుండా నిద్రపోతున్నారా? టీమిండియా ప్లేయర్లపై రోహిత్ ఆగ్రహం..

Rohit Sharma fire on teammates: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మూడోరోజు జరిగిన ఆటలో సహచర ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Rohit Sharma fire on teammates: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మూడోరోజు జరిగిన ఆటలో సహచర ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

బంగ్లాదేశ్ తో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా విజయం సాధించింది. 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్ తో సెంచరీ చేయడమే కాకుండా.. బాల్ తో మ్యాజిక్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఇదిలా ఉండగా.. మూడోరోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన నమోదు అయ్యింది. బహుశా ఈ దృశ్యాన్ని ఎవ్వరూ గమనించకపోవచ్చు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడోరోజు ఆటలో ప్లేయర్లపై ఫైర్ అయ్యాడు. ఫీల్డింగ్ చేస్తున్నారా? లేక నిద్రపోతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సహనం కోల్పోయాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మూడోరోజు ఆటలో భారత ఆటగాళ్లపై నోరుపారేసుకున్నాడు. అసలేం జరిగిందంటే? మూడోరోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డ్ ను సెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్లేయర్లు అతడి సూచనలను పట్టించుకోకపోవడంతో.. ఒక్కసారిగా సహనం కోల్పోయి తన నోటికి పని చెప్పాడు. ఫీల్డింగ్ చేస్తున్నారా? లేక నిద్రపోతున్నారా? అంటూ హిందీలో తిట్టాడు. ఈ మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. అయితే ఏ ఫీల్డర్ ను తిట్టాడు అన్నది తెలీయరాలేదు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. డ్రెస్సింగ్ రూమ్ లో ప్రాక్టీస్ లో తన సహచర ప్లేయర్లతో ఎంతో చనువుగా ఉండే రోహిత్.. గ్రౌండ్ లోకి దిగితే మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తన సూచనలు లెక్కచేయకపోయినా.. క్యాచ్ లు మిస్ చేసినా, సహనం కోల్పోయి వారిని తిడుతూ ఉంటాడు. గతంలో చాలా సందర్భాల్లో రోహిత్ ఇతర ప్లేయర్లను తిట్టడం మనకు తెలియని విషయం కాదు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. 280 రన్స్ తేడాతో గెలిచి.. సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. రవిచంద్రన్ అశ్విన్ బాల్ తో మ్యాజిక్ చేసి 6 వికెట్లు తీయడంతో.. బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 234 రన్స్ కు కుప్పకూలింది. జట్టులో కెప్టెన్ షాంటో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా ప్లేయర్ల నుంచి సపోర్ట్ లేకపోవడం, అశ్విన్, జడేజా(3 వికెట్లు) సత్తా చాటడంతో.. బంగ్లా ప్లేయర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇక పాక్ పై చూపించిన జోరును ఇండియాపై కూడా చూపిస్తాం అన్న బంగ్లా కెప్టెన్ మాటలకు విజయంతోనే ఆన్సర్ ఇచ్చింది టీమిండియా.

Show comments