బుచ్చిబాబు టోర్నీలో అదరగొడుతున్న హైదరాబాదీ స్పిన్నర్‌ తనయ్ త్యాగరాజన్!

Tanay Thyagarajan, Buchi Babu Tournament, HCA: ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నీ అయిన బుచ్చిబాబు టోర్నమెంట్‌లో తనయ్‌ త్యాగరాజన్‌ అదరగొడుతున్నాడు. తాజాగా ముంబై కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని ప్రదర్శన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Tanay Thyagarajan, Buchi Babu Tournament, HCA: ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నీ అయిన బుచ్చిబాబు టోర్నమెంట్‌లో తనయ్‌ త్యాగరాజన్‌ అదరగొడుతున్నాడు. తాజాగా ముంబై కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని ప్రదర్శన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తమిళనాడు వేదికగా ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నీ బుచ్చిబాబు టోర్నమెంట్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ టోర్నీలో టీమిండియా స్టార్‌ ప్లేయర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు కూడా ఆడుతున్నారు. సెప్టెంబర్‌ 11 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. తమిళనాడులోని నాథమ్(దిండిగల్), సేలం, కోయంబత్తూర్, తిరునెల్వేలిలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 12 టీమ్స్‌ పాల్గొంటున్నాయి. దేశంలోని టాప్‌ 10 స్టేట్‌ టీమ్స్‌.. మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, రైల్వేస్‌, గుజరాత్‌, ముంబై, హర్యానా, జమ్మూ కశ్వీర్‌, ఛత్తీస్‌ఘడ్‌, హైదరాబాద్‌, బరోడాతో పాటు తమిళనాడు నుంచి రెండు టీమ్స్‌ తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఎలెవన్‌, తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ జట్లు కూడా ఈ టోర్నీలో ఆడతాయి.

ఈ టోర్నీలో హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్ల పంటపడిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకంటే ముందు జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 7 వికెట్లు సాధించాడు. జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. ముంబై సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ మరిన్ని వికెట్లు తీసే అవకాశం ఉంది.

ఇక తనయ్‌ త్యాగరాజన్‌ హైదరాబాద్‌ జట్టుకు ఆడుతున్నా.. అతనిది కర్ణాటక. 1995 నవంబర్‌ 15న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించాడు. దేశవాళి క్రికెట్‌లో హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. ఐపీఎల్‌ పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌లో ఉన్నాడు. ఇప్పటికే వరకు 22 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన తనయ్‌ 96 వికెట్లు పడగొట్టాడు. అలాగే 24 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు, 27 టీ20ల్లో 16 విక్టెలు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌ కూడా చేయగలడు. మరి ఇప్పుడు బుచ్చిబాబు టోర్నీలో మంచి ప్రదర్శన కనబరుస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments