T20 World Cup Final Rohit Sharma Speech Suryakumar Yadav: ఫైనల్​కు ముందు అతడి స్పీచ్​ మాలో కసి రేపింది.. సూర్యకుమార్ కామెంట్స్!

Suryakumar Yadav: ఫైనల్​కు ముందు అతడి స్పీచ్​ మాలో కసి రేపింది.. సూర్యకుమార్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్​పై భారత పించ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తుదిపోరుకు ముందు అతడు ఇచ్చిన స్పీచ్ తమలో గెలవాలనే తపన, కసిని పెంచిందన్నాడు.

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్​పై భారత పించ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తుదిపోరుకు ముందు అతడు ఇచ్చిన స్పీచ్ తమలో గెలవాలనే తపన, కసిని పెంచిందన్నాడు.

టీ20 వరల్డ్ కప్-2024 ముగిసింది. నెల రోజుల పాటు క్రికెట్ లవర్స్​ను ఎంతగానో అలరించిన మెగాటోర్నీ.. ఎట్టకేలకు పూర్తైంది. మొదటి మ్యాచ్ నుంచి డామినేషన్ చూపించిన టీమిండియానే టైటిల్​ను సొంతం చేసుకుంది. గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్​లోనూ ఓడిపోకుండా కప్పును ఎరగేసుకుపోయింది భారత్. అడ్డొచ్చిన ప్రతి టీమ్​నూ చిత్తు చేయడం, టోర్నీ మొత్తం ఆధిపత్యం చలాయించడం హైలైట్ అనే చెప్పాలి. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ కల నెరవడంతో 140 కోట్ల మంది భారతీయులు సంతోషంలో మునిగిపోయారు. రోహిత్ సేన కప్పును అందుకోగానే అభిమానులు వీధులు, రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుతూ, బాణసంచా కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఫైనల్​లో భారత్ గెలుపుపై ఆటగాళ్లు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమ్ ప్లానింగ్, ప్రెజర్​ను తట్టుకున్న తీరు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పించ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరుకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన స్పీచ్​ తమలో గెలవాలనే కసి, పట్టుదలను పెంచిందని అన్నాడు. అతడు మాట్లాడుతుంటే తమకు గూస్​బంప్స్ వచ్చాయన్నాడు. హిట్​మ్యాన్ మాటలు మంత్రంగా పనిచేశాయని.. గెలుపునకు అదే కారణమన్నాడు సూర్య. ఏదైనా ఒక్కరితో సాధ్యం కాదని.. తలో చేయి వేసి, సమష్టిగా రాణిస్తే అద్భుతం చేయొచ్చని రోహిత్ చెప్పిన మాటలు తమలో ఎనలేని విశ్వాసాన్ని నింపాయన్నాడు మిస్టర్ 360.

‘ఫైనల్ మ్యాచ్​కు ముందు రోహిత్ భాయ్ మాతో చెప్పిన మాటలు మ్యాచ్​లో ఎంతో ప్రభావం చూపించాయి. నేనొక్కడ్నే ఒంటరిగా పర్వతాన్ని ఎక్కలేనని అతడు అన్నాడు. పర్వత కొసను చేరుకోవాలంటే మీ అందరి ఆక్సిజన్ నాకు అవసరమని చెప్పాడు. మీ కాళ్లు, మెదడు, మనసులో ఉన్న శక్తినంతా కూడదీసి ఈ గేమ్​లో ఆడమని రోహిత్ ధైర్యం నింపాడు’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ ఇచ్చిన ప్రోత్సాహం, తమపై చూపించిన నమ్మకం వల్లే ట్రోఫీ కొట్టగలిగామని మిస్టర్ 360 పేర్కొన్నాడు. కోహ్లీ గురించి కూడా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ ఎనర్జీకి పవర్​హౌస్​ లాంటోడని మెచ్చుకున్నాడు. అతడితో ఉంటూ సాధన చేయడం వల్ల తాను మరింత ఫిట్​గా తయారయ్యానని తెలిపాడు సూర్య. మరి.. రోహిత్ స్పీచ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments