వరల్డ్ కప్​కు ముందు కోహ్లీ కీలక వ్యాఖ్యలు.. అది వీక్​నెస్​గా మారుతోందంటూ..!

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టీ20 వరల్డ్ కప్​-2024కు రెడీ అవుతోంది. ఎలాగైనా పొట్టి కప్పును కొట్టేయాలని చూస్తోంది. ఎవరెదురొచ్చినా తొక్కుకుంటూ పోవాలని భావిస్తోంది.

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టీ20 వరల్డ్ కప్​-2024కు రెడీ అవుతోంది. ఎలాగైనా పొట్టి కప్పును కొట్టేయాలని చూస్తోంది. ఎవరెదురొచ్చినా తొక్కుకుంటూ పోవాలని భావిస్తోంది.

ఇప్పుడు ఎక్కడ చూసినా టీ20 వరల్డ్ కప్-2024 గురించే మాట్లాడుకుంటున్నారు. పొట్టి కప్పులో ఎవరు విజేతగా నిలుస్తారు? ఏ జట్టు ఎంత వరకు వెళ్లగలుగుతుంది? అనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. టీమ్స్ అన్నీ బలంగా ఉండటంతో ప్రిడిక్షన్ కష్టమవుతోంది. ఒక్క బాల్​లో రిజల్ట్ మారిపోయే టీ20ల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. అయితే చాలా మటుకు ఎక్స్​పర్ట్స్, మాజీ క్రికెటర్లు మాత్రం టీమిండియానే ఫేవరెట్​గా చెబుతున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ రూపంలో బలమైన జట్లు ఉన్నప్పటికీ యంగ్​స్టర్స్, ఎక్స్​పీరియెన్స్​డ్ ప్లేయర్లతో నిండి ఉన్న రోహిత్ సేనే ఈ సారి కప్పు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం తమపై అతిగా ఆశలు పెట్టుకోవద్దని అంటున్నాడు.

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ నెగ్గుతుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. వన్డే వరల్డ్ కప్-2023 తృటిలో మిస్సైనందున పొట్టి కప్పునైనా కైవసం చేసుకోవాలని అంటున్నారు. ఒకవైపు ఫ్యాన్స్ ఎక్స్​పెక్టేషన్స్, మరోవైపు ఎక్స్​పర్ట్స్ ప్రిడిక్షన్స్ కూడా రోహిత్ సేనకు అనుకూలంగా ఉన్నాయి. అయితే కింగ్ కోహ్లీ మాత్రం బిగ్ ఎక్స్​పెక్టేషన్స్ జట్టుకు అస్సలు మంచివి కావని అన్నాడు. ఇవి ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని చెప్పాడు. అనవసర హైప్​కు దూరంగా ఉంటేనే మంచిదని తెలిపాడు. భారీ అంచనాలు జట్టుకు వీక్​నెస్​గా మారుతున్నాయని పేర్కొన్నాడు. ఇదే జట్టుకు బలమని, ఇదే బలహీనతగా మారే ప్రమాదం కూడా పొంచి ఉందని విరాట్ స్పష్టం చేశాడు.

‘భారత జట్టు మీద ఆశలు పెట్టుకోవద్దని నేను చెప్పను. అభిమానులు ఎలాగూ టీమ్​పై ఎక్స్​పెక్టేషన్స్ పెట్టుకుంటారు. మన దేశంలో క్రికెట్​ను ప్రత్యేక దృష్టితో చూస్తారు. ఇది జట్టుకు బలం. అంచనాల గురించి ఎక్కువ ఆలోచిస్తే అది బలహీనతగా మారుతుంది. ఇంత మంది ఫ్యాన్స్ మన వెంట ఉన్నారనే విషయాన్ని స్ట్రెంగ్త్​గా చూసి స్ఫూర్తి పొందితే బాగుంటుంది’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. టీమిండియా మీద ఉన్న హైప్​ను కోహ్లీ తగ్గిస్తే.. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం టీ20 ప్రపంచ కప్ నెగ్గేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2007లో జరిగిన ఫస్ట్ టీ20 కప్పును గెలిచామని.. అప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా దగ్గరగా వచ్చి ఆగిపోతున్నామని చెప్పాడు. ఛాంపియన్​గా నిలిచేందుకు ఇది గ్రేట్ ఛాన్స్ అని పేర్కొన్నాడు హిట్​మ్యాన్. మరి.. భారీ అంచనాలు జట్టుకు బలహీనతగా మారాయంటూ విరాట్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments