కోహ్లీ త్వరగా ఔటవ్వడం టీమిండియాకు మంచిదే! గవాస్కర్ షాకింగ్ కామెంట్స్..

కోహ్లీ త్వరగా ఔటవ్వడం టీమిండియాకు మంచిదే! గవాస్కర్ షాకింగ్ కామెంట్స్..

ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫెయిల్ కావడంపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ వింత కామెంట్స్ చేశాడు. కోహ్లీ త్వరగా అవుట్ అవ్వడం టీమిండియాకు మంచిదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి గవాస్కర్ ఇలా ఎందుకు అన్నాడో తెలుసుకుందాం పదండి.

ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫెయిల్ కావడంపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ వింత కామెంట్స్ చేశాడు. కోహ్లీ త్వరగా అవుట్ అవ్వడం టీమిండియాకు మంచిదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి గవాస్కర్ ఇలా ఎందుకు అన్నాడో తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడిన తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించి.. బోణీ కొట్టింది టీమిండియా. ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో గెలిచి, ఈ ప్రపంచ కప్ లో తన వేటను మెుదలుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ.. ఫ్యాన్స్ లో ఓ నిరాశ మిగిలిపోయింది. అదే విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకు ఔట్ కావడం. ఈ మ్యాచ్ లో 5 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మార్క్ అడైర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ త్వరగా అవుట్ కావడం టీమిండియాకు మంచిదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్.

విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ లో పరుగుల వరదపారించాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ నిలిచాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే వెనుదిరిగాడు. ఇలా తక్కువ స్కోర్ కు విరాట్ వెనుదిరగడం పొట్టి ప్రపంచ కప్ లో ఇదే మెుదటిసారి. విరాట్ కోహ్లీ ఈ మెగాటోర్నీలో ఛేజ్ మాస్టర్ గా పేరుంది. ఇక గత మ్యాచ్ ల్లో ఛేదనల్లో కోహ్లి 78*, 36*, 54, 57*, 72*, 23, 55*, 82 పరుగులు సాధించాడు.

అయితే విరాట్ కోహ్లీ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే వెనుదిరగడం టీమిండియాకు మంచిదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజ సునీల్ గవాస్కర్. “స్టార్ ప్లేయర్లు ఓ మ్యాచ్ లో తక్కువ పరుగులు చేస్తే.. వచ్చే మ్యాచ్ లో దంచికొడతారు. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్, జో రూట్, స్టీవ్ స్మిత్ లను నేను గమనించాను. ఈ కసితో విరాట్ పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో విధ్వంసం సృష్టిస్తాడు. అందుకే ఐర్లాండ్ తో మ్యాచ్ లో కోహ్లీ త్వరగా ఔట్ కావడంపై ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాక్ తో మ్యాచ్ లో ఎలా చెలరేగాలో అతడు ఆలోచిస్తూ ఉంటాడు” అంటూ తనదైన శైలిలో కోహ్లీ గురించి చెప్పుకొచ్చాడు భారత దిగ్గజం. ఇక టీమిండియా వరల్డ్ కప్ లో తన నెక్ట్స్ మ్యాచ్ ను జూన్ 8న నాసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ లో పాకిస్తాన్ ను ఢీ కొనబోతోంది. ఈ పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి కోహ్లీపై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments