Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో తొలి సమరానికి సిద్ధమవుతోంది టీమిండియా. మొదటి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాలని చూస్తోంది. ఐర్లాండ్‌ను చిత్తు చేసి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో రెడీ అవ్వాలని అనుకుంటోంది.
టీ20 ప్రపంచ కప్-2024లో తొలి సమరానికి సిద్ధమవుతోంది టీమిండియా. మొదటి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాలని చూస్తోంది. ఐర్లాండ్‌ను చిత్తు చేసి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో రెడీ అవ్వాలని అనుకుంటోంది.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 క్రికెట్ లవర్స్‌ను అలరిస్తోంది. ఒకదాన్ని మించి మరో మ్యాచ్ ఉత్కంఠగా సాగుతూ అందరి అటెన్షన్‌ను ఇటు వైపు తిప్పేశాయి. రికార్డు ఛేజింగ్‌లు, సంచలన బౌలింగ్ ప్రదర్శనలతో మెగా టోర్నీ అందర్నీ ఊపేస్తోంది. ఇప్పటిదాకా యూఎస్ఏ, కెనడా, ఉగాండా, ఆఫ్ఘానిస్థాన్ లాంటి చిన్న జట్లే ఆడాయి. ఇప్పుడు క్రమంగా బడా టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. భారత జట్టు బుధవారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్‌తో పోరుతో వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది రోహిత్ సేన. న్యూయార్క్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. భారత్‌కు షాక్ ఇవ్వాలని ఐర్లాండ్ అనుకుంటుండగా.. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి పాకిస్థాన్‌తో పోరుకు మరింత కాన్ఫిడెన్స్‌తో వెళ్లాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తున్నారు. అయితే ఆ ముగ్గురు భారత్‌ను భయపెడుతున్నారు.
ఐర్లాండ్‌తో మ్యాచ్ కదా అని చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. పాకిస్థాన్‌తో జరిగే ఫస్ట్ మ్యాచే అసలు పోరాటమని భావిస్తున్నారు. కానీ ఇది టీ20 ఫార్మాట్. ఇక్కడ ఒక్క ఓవర్లో, ఒక్కోసారి ఒక్క బంతిలో కూడా ఫలితం తారుమారవుతుంది. ఐర్లాండ్‌కు బిగ్ టీమ్స్ మీద ఆడటం కొత్త కాదు. ఆ జట్టుకు బ్యాటింగే కొండంత బలం. పసికూన అని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ టీమ్ బ్యాటర్లు లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టార్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల పాకిస్థాన్ మీద విధ్వంసక ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. పాక్‌తో సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో టక్కర్ 34 బంతుల్లోనే 51 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అలాగే మూడో టీ20లో 41 బంతుల్లోనే 73 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు హ్యారీ టెక్టార్. రెండో టీ20 28 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో 20 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
టక్కర్, టెక్టార్ మెరుపు వేగంతో పరుగులు చేయడంలో ఆరితేరారు. క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో పరుగులు రాబట్టడం వీరికి అలవాటుగా మారింది. ఈ ఇద్దరికీ తోడు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ కూడా ఉన్నాడు. ఫామ్‌లో లేకపోయినా తనదైన రోజున ఎలాంటి బౌలర్లను అయినా చీల్చిచెండాడే సత్తా అతడి సొంతం. ఈ ముగ్గురితో భారత్ జాగ్రత్తగా ఉండాలి. లైట్ తీసుకుంటే మాత్రం రిజల్ట్ తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఒక్క ఓవర్లో అంతా మారిపోయే టీ20 క్రికెట్లో ఎవర్నీ తక్కువ అంచనా వేయడానికి లేదు. టక్కర్, టెక్టార్, స్టిర్లింగ్‌కు తోడు ఆండ్రీ బాల్బిరైన్ రూపంలో మరో సాలిడ్ బ్యాటర్ ఐర్లాండ్ టీమ్‌లో ఉన్నాడు. వీళ్లు ఎలా ఆడతారనేది మన బౌలర్లకు పెద్దగా అంచనా లేదు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఔట్ చేసి.. మ్యాచ్‌ను చేతిలోకి తీసుకొనేందుకు ప్రయత్నించాలి.