కోహ్లీని కాదు.. ఆ టీమిండియా బ్యాటర్ ను అవుట్ చేయడం చాలా కష్టం: మహ్మద్ అమీర్

కోహ్లీని కాదు.. ఆ టీమిండియా బ్యాటర్ ను అవుట్ చేయడం చాలా కష్టం: మహ్మద్ అమీర్

టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీని ఔట్ చేయడం కంటే.. ఆ ప్లేయర్ ను ఔట్ చేయడమే చాలా కష్టం అని చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీని ఔట్ చేయడం కంటే.. ఆ ప్లేయర్ ను ఔట్ చేయడమే చాలా కష్టం అని చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

ఉప్పు, కారం లేని కూరలా చప్పగా సాగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో.. ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉందంటే? అది ఒక్క ఇండియా-పాక్ మ్యాచే. ఈ మెగాటోర్నీలో భాగంగా జూన్ 9(ఆదివారం) దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఈ హై ఓల్టేజ్ పోరు గురించే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజాలు, క్రికెటర్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ పలు ఆసక్తికర విషయాలు వరల్డ్ కప్ ప్రధాన బ్రాడ్ కాస్టర్ తో పంచుకున్నాడు. విరాట్ కోహ్లీని కాదు.. ఆ టీమిండియా బ్యాటర్ ను పెవిలియన్ చేర్చడం చాలా కష్టం అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ప్రపంచ దృష్టి మెుత్తం ఇండియా-పాక్ మ్యాచ్ పైనే ఉంది. వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ లోని నాసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం(జూన్9) రాత్రి 8 గంటలకు ఈ రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్. వరల్డ్ కప్ అధికారిక బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడుతూ..

“రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతడు ఒక్కసారి క్రీజ్ లో కుదురుకున్నాడు అంటే.. అతడిని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఏ బౌలర్ ను కూడా వదలకుండా దంచికొడతాడు. అందుకే రోహిత్ ను ఆరంభంలోనే అవుట్ చేయాలి. అతడు 15-20 బంతులు ఎదుర్కొంటే బౌలర్లకు విశ్వరూపం చూపిస్తాడు. మిగతా ప్లేయర్ల కంటే హిట్ మ్యాన్ ఔట్ చేయడం చాలా కష్టం. అయితే నాకు అతడి బలం, బలహీనతలు తెలుసు. కొత్త బంతితోనే అతడి ప్యాడ్స్ పై హిట్ చేయాలి.. అప్పుడే ఔట్ అవుతాడు. గతంలో నేను ఇలానే రోహిత్ ను పెవిలియన్ చేర్చాను” రోహిత్ ను పొగడ్తలతో ముంచెత్తాడు పాక్ పేసర్. ఈ సందర్భంగా 2019 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ను గుర్తుచేసుకున్నాడు అమీర్. మరి ఈ పాక్ పేసర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments