ఆ రోజు రోహిత్​, కోహ్లీని చూసి భయపడ్డా.. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Virat Kohli, Rohit Sharma, T Dileep: ఈ మధ్య కాలంలో భారత జట్టు అపూర్వ విజయాలు సాధిస్తూ వస్తోంది. ఇందులో ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్ కృషిని కూడా మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ పనితీరును ప్రశంసించకుండా ఉండలేం.

Virat Kohli, Rohit Sharma, T Dileep: ఈ మధ్య కాలంలో భారత జట్టు అపూర్వ విజయాలు సాధిస్తూ వస్తోంది. ఇందులో ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్ కృషిని కూడా మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ పనితీరును ప్రశంసించకుండా ఉండలేం.

ఈ మధ్య కాలంలో భారత జట్టు అపూర్వ విజయాలు సాధిస్తూ వస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్-2023, వన్డే ప్రపంచ కప్-2023లో రన్నరప్​గా నిలిచిన టీమిండియా.. టీ20 వరల్డ్ కప్-2024లో ఛాంపియన్​గా ఆవిర్భవించింది. ఫార్మాట్ ఏదైనా భారత జట్టు దిగనంత వరకే అనే రేంజ్​లో డామినేషన్ కంటిన్యూ చేస్తోంది. ఇందులో ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్ కాంట్రిబ్యూషన్​ను కూడా మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ పనితీరును ప్రశంసించకుండా ఉండలేం. భారత జట్టులో టాప్ ఫీల్డింగ్ స్టాండర్డ్స్​ను సెట్ చేసి.. ఫీల్డింగ్​ను టీమ్ స్ట్రెంగ్త్​గా మార్చేశాడీ తెలుగు బిడ్డ. బ్యాటర్లతో పాటు బౌలర్లను బలమైన ఫీల్డర్లుగా మార్చి టీమిండియాను నంబర్ వన్ టీమ్​గా నిలబెట్టడంతో ఎంతో కృషి చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీతోనూ కలసిపోయి వాళ్ల నుంచి బెస్ట్ ఔట్​పుట్ రాబడుతున్నాడు. అలాంటోడు రోకో జోడీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

రోహిత్-కోహ్లీ భారత క్రికెట్​కు రెండు మూలస్తంభాలుగా కొనసాగుతున్నారు. దశాబ్దంన్నర నుంచి టీమ్ భారాన్ని మోస్తున్నారు. ఇద్దరూ అద్భుతమైన బ్యాటర్లే గాక కెప్టెన్లు కూడా. కోహ్లీ మాజీ సారథి కాగా.. రోహిత్ ప్రస్తుతం కెప్టెన్​గా ఉన్నాడు. ఎంతో సీనియర్లు అయిన వీళ్లతో మాట్లాడేందుకు కొత్త ఆటగాళ్లే గాక కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ కూడా భయపడతారు. తాను కూడా మొదట్లో వీళ్లను చూసి జంకానని అంటున్నాడు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్. కెరీర్ తొలిదశలో రోకో జోడీని చూసి భయపడ్డానని అన్నాడు. తాను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు, కాబట్టి వాళ్లిద్దరూ తనను ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఫియర్ ఉండేదన్నాడు. దీంతో కొన్నాళ్ల పాటు వారిని గమనిస్తూ ఉండేవాడ్నని, తన ఒపీనియన్ నేరుగా చెప్పేవాడ్ని కాదన్నాడు దిలీప్.

రోహిత్-కోహ్లీ విషయంలో తాను ఓపెన్​గా ఉంటూ ప్రతిదీ అబ్జర్వ్ చేసేవాడ్ని అని దిలీప్ చెప్పుకొచ్చాడు. ఫలానాది చేయమంటూ వాళ్లను బలవంతం చేయడం లాంటివి జరగలేదన్నాడు. రోకో జోడీతో మంచి రిలేషన్ ఏర్పడే వరకు మూడ్నాలుగు నెలల పాటు ప్రతిదీ డిస్కస్ చేసేవాడ్నని తెలిపాడు. అయితే చాలా తక్కువ మాట్లాడేవాడ్ని అని పేర్కొన్నాడు. వాళ్లను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టిందన్నాడు దిలీప్. ఆ తర్వాత వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడం స్టార్ట్ చేశానని వ్యాఖ్యానించాడు. ఇంటర్నేషనల్ లెవల్​లో కోచింగ్ చేసేటప్పుడు మనకు ఎంత తెలుసునేది ముఖ్యం కాదని.. ఏ విషయమైనా ఎప్పుడు, ఎలా చెప్పాలనేది చాలా ఇంపార్టెంట్ అని వివరించాడు ఫీల్డింగ్ కోచ్. సరైన సమయంలో సరైన విషయం చెబితే ఆటగాళ్లు సులువుగా గ్రహిస్తారని తెలిపాడు. అలా అందరు ప్లేయర్లకు తగ్గట్లు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టానని.. వాళ్లు కూడా తనను అర్థం చేసుకొని కలసిపోయారన్నాడు దిలీప్.

Show comments