టీమిండియా స్టార్​కు గాయం.. దులీప్ ట్రోఫీ మొదలవక ముందే దూరం!

Suryakumar Yadav, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న ఓ టీమిండియా స్టార్​కు గాయమైంది. టోర్నమెంట్ మొదలవడానికి ముందే అతడు దూరమయ్యాడు.

Suryakumar Yadav, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న ఓ టీమిండియా స్టార్​కు గాయమైంది. టోర్నమెంట్ మొదలవడానికి ముందే అతడు దూరమయ్యాడు.

టీమిండియాకు ఇప్పుడు మ్యాచ్​లు లేకపోవడంతో ఫ్యాన్స్ ఫోకస్ అంతా డొమెస్టిక్ క్రికెట్​ వైపు షిఫ్ట్ అయింది. దీనికి కారణం నేషనల్ డ్యూటీ లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ భారత క్రికెట్ బోర్డు కొత్త నిబంధన తీసుకురావడమే. దులీప్ ట్రోఫీ-2024 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది. అందుకే ఈ టోర్నమెంట్​లో ఆడేందుకు భారత స్టార్లంతా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీమ్స్​ను కూడా అనౌన్స్ చేశారు. ఆటగాళ్లంతా ప్రాక్టీస్​లో మునిగిపోయారు. ఫిట్​నెస్​ను మెరుగుపర్చుకుంటూనే ఫామ్​​లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టైమ్​లో ఓ టీమిండియా స్టార్​కు గాయమైంది. దీంతో అతడు ఆ టోర్నీకి దూరమయ్యాడు. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్​కు ఇంజ్యురీ అయింది. దులీప్ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతున్న స్కై చేతికి గాయమైంది. గత వారం బుచ్చిబాబు టోర్నమెంట్​లో భాగంగా టీఎన్​ఏసీ ఎలెవన్​తో జరిగిన మ్యాచ్​లో అతడికి ఇంజ్యురీ అయింది. ఈ కారణంతోనే ఆట ఆఖరి రోజు అతడు బరిలోకి దిగలేదని తెలిసింది. ఇంకా కోలుకోకపోవడంతో దులీప్ ట్రోఫీ ఆరంభ మ్యాచులకు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. దీంతో ఆంధ్రప్రదేశ్​లోని అనంతపూర్​లో ఇండియా సీ-ఇండియా డీ మధ్య జరగనున్న మ్యాచ్​కు సూర్య దూరం కానున్నాడు. గాయంతో బాధపడుతున్న స్కై.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడని తెలుస్తోంది.

సూర్యకు అయిన గాయం తీవ్రత ఎంతనేది ఇంకా తెలియరాలేదు. ఇంజ్యురీ చిన్నదే అయితే ఇబ్బందేం లేదు. కానీ గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం ఇబ్బందే. ఇక, శ్రీలంక సిరీస్​ నుంచి సూర్యకుమార్​కు టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు. ఇక మీదట అతడు పొట్టి ఫార్మాట్​కే పరిమితం అవుతాడని.. వన్డేలు, టెస్టులకు దూరంగా ఉంటాడని స్పష్టం చేశారు. అయితే స్కై మాత్రం లాంగ్ ఫార్మాట్​లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది తన డ్రీమ్ అని.. టెస్టుల్లో రాణించడంపై ఫోకస్ చేస్తున్నానని అంటున్నాడు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు టోర్నీలో పాల్గొన్న మిస్టర్ 360.. దులీప్ ట్రోఫీలోనూ దుమ్మురేపాలని అనుకున్నాడు. ఆ టోర్నీలో రాణించి టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. ఈ తరుణంలో గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచులకు దూరమయ్యాడు. మరి.. సూర్యను టెస్టుల్లో ఆడితే చూడాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments