సూర్యకుమార్ యాదవ్.. భారత క్రికెట్లో సెపరేట్ ఫ్యాన్‌బేస్ కలిగిన క్రికెటర్. రెగ్యులర్ షాట్స్ కాకుండా క్రికెట్ బుక్‌లో లేని వైవిధ్యమైన షాట్లు కొట్టడం అతడి ప్రత్యేకత. మ్యాచ్ పరిస్థితులు, పిచ్ కండీషన్స్ లాంటివి సూర్య పట్టించుకోడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలిస్తాడు. సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ స్టయిల్లో 360 డిగ్రీల ఆటతీరుతో విధ్వంసం సృష్టిస్తాడు సూర్యకుమార్. ధనాధన్ బ్యాటింగ్‌తో చూస్తూ ఉండగానే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాక్కుంటాడు. క్రీజులో డ్యాన్స్ చేస్తూ బంతిని బౌండరీల మార్గం చూపిస్తూ బౌలర్లను ఊచకోత కోయడం అతడికి ఓ అలవాటుగా మారింది. ఎందుకో గానీ కొన్ని నెలలుగా సూర్యకుమార్ బ్యాట్ మూగబోయింది.
ఈమధ్య సూర్యకుమార్ పరుగుల ప్రవాహం తగ్గిపోయింది. అతడి బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. సంచలన ఇన్నింగ్స్‌లు అస్సలు రావడం లేదు. గతేడాది జనవరిలో శ్రీలంకపై టీ20లో సెంచరీ సాధించిన తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత మిస్టర్ 360 బ్యాట్ మళ్లీ మ్యాజిక్ చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అతడు మరోసారి తన విశ్వరూపం చూపించాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడమవైపు సిక్సర్లు, తలపై నుంచి బౌండరీలు, కిందపడుతూ భారీ షాట్లు, అలాగే ముందుకొచ్చి బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. విండీస్‌పై సూర్య తాజా ఇన్నింగ్స్ కనులవిందుగా సాగింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా రెచ్చిపోయాడు.
సిరీస్‌కు కీలకంగా మారిన మ్యాచ్‌లో సూర్య సునామీ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ప్రమాదం నుంచి తాత్కాలికంగా బయటపడేశాడు. ఈ క్రమంలో పలు కొత్త రికార్డులను సూర్యకుమార్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య సెంచరీ మార్క్ అందుకున్నాడు. అదేంటి? అతడు కొట్టింది 83 రన్సే కదా! అవును, సూర్య 83 పరుగులే చేసినా టీ20ల్లో అదురైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 100 సిక్సుల మార్క్‌ను రీచ్ అయ్యాడు. సూర్య 49 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అతడి కంటే ముందు ప్లేస్‌లో ఎవిన్ లూయిస్ (42) ఉన్నాడు. సిక్సుల విషయంలో సెంచరీ మార్క్‌ను అందుకున్న భారత ప్లేయర్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరసన చేరాడు సూర్య. ఓవరాల్‌గా ఈ ఫీట్‌ను అందుకున్న పదమూడో ప్లేయర్‌గా నిలిచాడు.
Surya-kamaal Yadav 🤩🔥#WIvIND #JioCinema #SabJawaabMilenge pic.twitter.com/GHcdT5ybsk
— JioCinema (@JioCinema) August 8, 2023