హిస్టరీ క్రియేట్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌! ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..

హిస్టరీ క్రియేట్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌! ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..

IND vs SL, Super Over, Suryakumar Yadav: శ్రీలంకతో​ మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs SL, Super Over, Suryakumar Yadav: శ్రీలంకతో​ మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌ కూడా సాధించని అద్బుత రికార్డును టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన పేరిట లిఖించుకున్నాడు. ఒక టీమిండియా మ్యాచ్‌లో తొలి సారి బౌలింగ్‌ వేస్తూ.. తొలి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు సాధించాడు.. అది కూడా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కేవలం 6 పరుగులు డిఫెండ్‌ చేస్తూ.. మ్యాచ్‌ను టై చేశాడు. ఇవన్నీ కాకుండా.. ఒక కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేయడం అది తన కెరీర్‌లోనే తొలి ఓవర్‌ కావడం.. ఇప్పటి వరకు క్రికెట్‌ చరిత్రలో జరగలేదు. ఈ అద్భుతాన్ని సూర్య మరింత అద్భుతంగా జీవిత కాలం గుర్తుండి పోయేలా చేసుకున్నాడు.

శ్రీలంకతో మంగళవారం పల్లెకలె వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ ఓవర్‌లో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసి.. లంక ముందు తక్కువ టార్గెట్‌ పెట్టింది టీమిండియా. ఆ టార్గెట్‌ను లంక బ్యాటర్లు నిదానంగా ఛేజ్‌ చేసుకుంటూ వెళ్లారు. ఆల్‌మోస్ట్‌ గెలుపు వాకింట్లోకి వచ్చిన తర్వాత.. భారత పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు చెలరేగిపోయారు. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కడే రెగ్యులర్‌ బౌలర్‌.. కానీ, రియాన్‌ పరాగ్‌, రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా.. లెజెండరీ స్పిన్నర్లు పూనినట్లు లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. సింపులుగా గెలవాల్సిన మ్యాచ్‌లో కూడా లంకను ఓడించారు. ముఖ్యంగా రింకూ, సూర్య.. చివరి రెండు ఓవర్లలో వండర్‌ బౌలింగ్‌ వేశాడు.

లంక విజయానికి చివరి 12 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే కావాలి చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అయినా లంక ఓడిపోతుందని బహుషా ప్రపంచంలో ఏ క్రికెట్‌ అభిమాని కూడా ఊహించి ఉండడు. ఆట అంటే అదే కదా.. ఊహకు అందని విధంగా సాగుతుంది. 19వ ఓవర్‌ వేసిన రింకూ సింగ్‌.. కేవలం 3 పరుగులు మాత్రమే ఇ‍చ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. 46 పరుగులతో దూసుకెళ్తున్న కుసల్‌ పెరీరాను అలాగే రమేష్‌ మెండిస్‌ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత.. చివరి ఓవర్‌ వేసేందుకు వచ్చిన సూర్య సంచలనం సృష్టిస్తూ.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి.. మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు తీసుకెళ్లాడు. సూపర్‌ ఓవర్‌లో ఇండియా ఈజీగా గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో సూర్య చివరి ఓవర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments