Somesekhar
2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న తమ టీమ్ మెంటర్ స్థానాన్ని ఓ స్టార్ ప్లేయర్ తో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న తమ టీమ్ మెంటర్ స్థానాన్ని ఓ స్టార్ ప్లేయర్ తో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Somesekhar
ఐపీఎల్ 2024 టైటిల్ ను చేజిక్కుంచుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు తెగ ఆరాటపడుతున్నాయి. అందుకోసం వేలం ముందు నుంచి, వేలం తర్వాత కూడా ప్రణాళికలు వేస్తూనే ఉన్నాయి. ఏ ప్లేయర్ ను కొంటే బాగుంటుంది? ఎవరిని విడిచిపెడితే బాగుంటుంది? అన్న విషయాలపై లోతుగా ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. అందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ స్పెషలిస్ట్ ప్లేయర్ ను తమ మెంటర్ గా నియమించేందుకు పావులు కదుపుతున్నట్లు వినికిడి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేంటంటే? లక్నో జట్టుకు మెంటర్ గా ఐపీఎల్ స్పెషలిస్ట్ ఆటగాడిని పేరొందిన, టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాను నియమించుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే అతడితో సంప్రదింపులు జరిపినట్లు, ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయానికి తాజాగా రైనా చేసిన ట్వీట్ మరింత ఊతమిస్తోంది. అసలు విషయం ఏంటంటే? ఈ న్యూస్ పై ఓ జర్నలిస్ట్ స్పందిస్తూ..’లక్నో యాజమాన్యంతో రైనా ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, అవన్నీ తప్పుడు వార్తలే’ అంటూ సదరు విలేకరి ట్వీట్ చేశాడు.
ఇక ఆ పోస్ట్ కు రైనా స్పందిస్తూ.. ఎందుకు ఆ వార్తలు ఎల్లప్పుడు నిజం కాకూడదా? అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో రైనా నిజంగానే లక్నో టీమ్ కు మెంటర్ గా జాయిన్ అయ్యాడా? అవుతున్నాడా? అంటూ తికమకపడుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇది నిజమైతే ఐపీఎల్ స్పెషలిస్ట్ గా ముద్రపడ్డ రైనా సేవలు లక్నోకు అద్భుతంగా ఉపయోగపడతాయి అంటున్నారు క్రీడా పండితులు. ఇదిలా ఉండగా.. గత రెండు సీజన్ల వరకు లక్నోకు మెంటర్ గా టీమిండియా మాజీ ప్లేయర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ వ్యవహరించాడు. వచ్చే ఐపీఎల్ కోసం వేలానికి ముందు అతడిని విడిచిపెట్టింది లక్నో. దీంతో ప్రస్తుతం లక్నో టీమ్ మెంటర్ పదవి ఖాళీగా ఉంది.
ఇక ఈ పదవిని మిస్టర్ ఐపీఎల్ తో భర్తీ చేసేందుకు యాజమాన్యం సన్నాహకాలు చేస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. చెన్నై మెుత్తంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలవగా.. అందులో 4 సార్లు చెన్నై జట్టులో సభ్యుడుగా ఉన్నాడు రైనా. కాగా.. రైనా ఐపీఎల్ కెరీర్ లో మెుత్తం 205 మ్యాచ్ లు ఆడి 5528 పరుగులు చేశాడు. అందులో ఒక శతకంతో పాటుగా 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి ఇలాంటి బ్యాటర్ లక్నోకు మెంటర్ గా వచ్చే మంచి ఫలితాలే ఉంటాయని భావిస్తున్నారు లక్నో ఫ్యాన్స్. మరి లక్నో టీమ్ మెంటర్ గా సురేష్ రైనాను నియమిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Why ? Your news can’t be rite all the time ?
— Suresh Raina🇮🇳 (@ImRaina) December 23, 2023