SNP
SRH vs RCB, IPL 2024: ఐపీఎల్‌లో క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి మ్యాచ్ రాబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటే.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం భయపడుతున్నారు. దానికి కారణం.. టార్గెట్ 300. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SRH vs RCB, IPL 2024: ఐపీఎల్‌లో క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి మ్యాచ్ రాబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటే.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం భయపడుతున్నారు. దానికి కారణం.. టార్గెట్ 300. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ఓడిపోయిన ఆర్సీబీపై చాలా మంది జాలి చూపిస్తున్నారు. ఎంతో కసిగా పోరాడిన జట్టు.. చివరి బాల్‌కు ఓడిపోవడం, విరాట్ కోహ్లీ దురదృష్టవశాత్తు అవుట్ కావడంతో చాలామంది నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఉండాల్సిందని అనుకుంటున్నారు. ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచి ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో.. ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో.. ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ముగిశాయనే చెప్పాలి. అయితే.. ఆర్సీబీకి అసలు పరీక్ష నెక్ట్స్ మ్యాచ్‌లో ఉంటుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఆర్సీబీ నెక్ట్స్ మ్యాచ్ ఆడబోయేది సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అది కూడా వాళ్ల గడ్డ అయిన హైదరాబాద్‌లో. దీంతో.. ఆర్సీబీ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు.
ఈ సీజన్ కంటే ముందు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ అంటే 263. ఇది ఆర్సీబీనే క్రికెట్ చేసింది. 11 ఏళ్లుగా చెక్కు చెదరని ఈ రికార్డు.. ఈ సీజన్‌లో ఏకంగా నాలుగు సార్లు బ్రేక్ అయింది. అందులో మూడు సార్లు ఎస్‌ఆర్‌హెచ్చే ఆ రికార్డను బద్దలుకొట్టింది. ఒకసారి కేకేఆర్ బ్రేక్ చేసింది. మొత్తం ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్‌గా 287 పరుగులు సన్‌రైజర్స్ పేరిటే ఉంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 287, 277, 266.. ఇలా రికార్డు స్థాయిలో స్కోర్లు చేస్తోంది. ఆ జట్టులోని ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ ఎలాంటి ఫామ్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ముఖ్యంగా ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ అయితే.. పవర్ ప్లేలో ప్రత్యర్థి జట్లను షేక్.. షేకాడిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్ ప్లేలోని 6 ఓవర్లలో ఏకంగా 125 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లోనే 300 పరుగుల మైలు రాయిని ఎస్‌ఆర్‌హెచ్ చేరుకుంటుందని అంతా భావించారు. కానీ కొద్దిలో మిస్ అయింది. హెడ్, క్లాసెన్ వెంటవెంటనే అవుట్ అవ్వడంతో ఆ రికార్డ్ తప్పింది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్ తమ తర్వాతి మ్యాచ్‌ను ఆర్సీబీతో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కనుక టాస్ గెలిచి ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ తీసుకున్నా, ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా.. ఆ 300 మార్క్ దాటడం పక్కా అని అంటున్నారు క్రికెట్ అభిమానులు. ఎందుకంటే.. ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్ అంత పేలవంగా ఉంది. పైగా వరుస ఓటములతో ఆ జట్టు డీలా పడిపోయింది. పైగా ఉప్పల్ పిచ్ ప్లాట్‌గా ఉండి, బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. మరి ఈ నెల 25న ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
27th March – SRH scored 277/3 Vs MI.
15th April – SRH scored 287/3 Vs RCB.
– Captain Cummins has made an impact which is lethal, this whole unit is full of beasts. 🤯👌 pic.twitter.com/Is226p2F3b
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024