iDreamPost
android-app
ios-app

T20 Blast: సునీల్ నరైన్ తుపాన్ ఇన్నింగ్స్! 37 బంతుల్లోనే విధ్వంసం..

  • Author Soma Sekhar Published - 03:40 PM, Mon - 3 July 23
  • Author Soma Sekhar Published - 03:40 PM, Mon - 3 July 23
T20 Blast: సునీల్ నరైన్ తుపాన్ ఇన్నింగ్స్! 37 బంతుల్లోనే విధ్వంసం..

టీ20 బ్లాస్ట్ లీగ్ లో ఓ పక్క బౌలర్లు, మరో పక్క బ్యాటర్లు రాణిస్తున్నారు. మెున్నటి మ్యాచ్ లో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది తొలి ఓవర్లోనే 4 వికట్లు తీసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్, ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తన విశ్వరూపాన్ని చూపాడు. ఎసెక్స్ తో జరిగిన మ్యాచ్ లో తుపాన్ ఇన్నింగ్స్ తో తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కానీ బౌలర్ల వైఫల్యం కారణంగా మ్యాచ్ ఓడిపోయింది సర్రే జట్టు. ఇక ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు నరైన్. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

టీ20 బ్లాస్ట్ లీగ్ లో భాగంగా.. ఆదివారం ఎసెక్స్ వర్సెస్ సర్రే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సర్రే స్టార్ బ్యాటర్, విండీస్ ఆటగాడు సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి.. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. అతడి బ్యాటింగ్ ధాటికి సర్రే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. నరైన్ కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ లో విల్ జాక్స్ (23), జేసన్ రాయ్ (28), జేమీ ఓవర్టన్ (23) పరుగులు చేశారు.

అనంతరం 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్ జట్టు.. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ కొట్టి విజయం సాధించింది. సీన్ అబాట్ బౌలింగ్ లో ఫెరోజ్ ఖుషీ ఆఖరి బంతికి సిక్సర్ బాది ఎసెక్స్ ను గెలిపించాడు. జట్టులో మైఖేల్ కైల్ పెప్పర్ (75), ఫెరోజ్ ఖుషీ (35*), డేనియల్ లారెన్స్ (58) రన్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అయితే బ్యాటింగ్ లో తుపాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిన నరైన్.. బౌలింగ్ లో మాత్రం తేలిపోయాడు. 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss