iDreamPost
android-app
ios-app

కోహ్లీ స్టార్ క్రికెటర్ అవ్వడానికి కారణం అతడే.. గవాస్కర్ సంచలన కామెంట్స్!

  • Published May 18, 2024 | 10:25 AM Updated Updated May 18, 2024 | 10:25 AM

మరోసారి గవాస్కర్ విరాట కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ స్టార్ క్రికెటర్ అవ్వడానికి కారణం ఆ దిగ్గజ ప్లేయర్ అంటూ పేర్కొన్నాడు గవాస్కర్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మరోసారి గవాస్కర్ విరాట కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ స్టార్ క్రికెటర్ అవ్వడానికి కారణం ఆ దిగ్గజ ప్లేయర్ అంటూ పేర్కొన్నాడు గవాస్కర్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published May 18, 2024 | 10:25 AMUpdated May 18, 2024 | 10:25 AM
కోహ్లీ స్టార్ క్రికెటర్ అవ్వడానికి కారణం అతడే.. గవాస్కర్ సంచలన కామెంట్స్!

విరాట్ కోహ్లీ, టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ స్ట్రైక్ రేట్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. స్లో బ్యాటింగ్, యంగ్ ప్లేయర్ల కంటే తక్కువ స్ట్రైక్ రేట్ కలిగి ఉండటం, కోహ్లీ ఆర్సీబీ ఓటములకు ఒక విధంగా కారణం అంటూ సునీల్ గవాస్కర్ తో సహా పలువురు దిగ్గజాలు, నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇక ఈ విమర్శలకు కోహ్లీ సైతం తనదైన శైలిలో కౌంటర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి గవాస్కర్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ స్టార్ క్రికెటర్ అవ్వడానికి కారణం ఆ దిగ్గజ ప్లేయర్ అంటూ పేర్కొన్నాడు గవాస్కర్.

వరుస విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఫస్టాఫ్ లో 8 మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించే స్థాయి నుంచి ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరుకునే స్థాయికి వచ్చింది. ఇక నేడు(శనివారం) చెన్నై సూపర్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

“విరాట్ కోహ్లీ కెరీర్ ప్రారంభంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. బాగా రాణించలేకపోయాడు. ఒక మ్యాచ్ లో ఆడితే.. ఇంకో మ్యాచ్ లో ఆడకపోయేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీకి అండగా నిలబడ్డాడు మహేంద్రసింగ్ ధోని. కొన్ని మ్యాచ్ ల్లో విఫలం అవుతున్నా వరుసగా అవకాశాలు ఇచ్చి.. ఎక్స్ ట్రా మూమెంటన్ ఇచ్చాడు. దాంతోనే కోహ్లీ ఈ స్థాయికి చేరుకోగలిగాడు” అంటూ కామెంట్స్ చేశాడు గవాస్కర్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దాంతో కోహ్లీ ఫ్యాన్స్ గవాస్కర్ పై ఫైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ స్థాయిని మరిచి కామెంట్స్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరి మహేంద్రసింగ్ ధోని కారణంగానే విరాట్ కోహ్లీ ఈస్థాయికి వచ్చాడు అన్న గవాస్కర్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet