నా భార్య నన్ను కాదని అతన్ని ఇష్టపడుతోంది: స్టార్‌ క్రికెటర్‌

తన భార్యకు తనతో పాటు ఆడుతున్న క్రికెటర్‌ అంటేనే ఇష్టమని ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అన్నాడు. ‘మరి నేను?’ అని తనని అడిగితే.. ‘అతని తర్వాతే నువ్వు’ అని అంటుందన్నాడు. ఇంతకీ బ్రాడ్‌ భార్య ఎవరిని ఇష్టపడుతోంది అంటే.. ఇంగ్లండ్‌ స్టార్ క్రికెటర్‌ క్రిస్‌ వోక్స్‌ని. ప్రస్తుతం ఇంగ్లండ్‌ టీమ్‌లో వోక్స్‌ ఓ సంచలనంగా మారాడు. అతన అసాధరాణ ఆటతో ఇంగ్లండ్‌ను యాషెస్‌ పోరులో నిలబెట్టాడు.

తొలి రెండు టెస్టుల్లో ఓడి సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడిన ఇంగ్లండ్‌ను మూడో టెస్టులో తన అసాధారణ ఆటతో గెలిపించాడు. దీంతో ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1-2తో పోటీలో నిలిచింది. మిగిలిన రెండు టెస్టుల్లో గెలిస్తే యాషెస్‌ ఇంగ్లండ్‌ వశం అవుతుంది. అయితే.. మూడో టెస్టు గెలవడానికి కారణమైన క్రిస్‌ వోక్స్‌పై ఆ జట్టు సీనియర్‌ స్టార్‌ క్రికెటర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ పత్రికకు రాసిన కాలంలో వోక్స్‌ ఆట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

క్రిస్ వోక్స్ అసాధారణమైన ఆటగాడని, అతనంటే తన భార్య మోలీకి పిచ్చని తెలిపాడు. చివరకు అతని తర్వాతే తాను అని చెప్పిందని పేర్కొన్నాడు. ఇది అతనికి దక్కిన అతిపెద్ద ప్రశంస అని తెలిపాడు. ఇంగ్లండ్ రెండు ప్రపంచకప్స్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడని, ముఖ్యంగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా హెడింగ్లీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని బ్రాడ్ రాసుకొచ్చాడు. కాగా బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మరి ఈ టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. అయితే.. బ్రాడ్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని దగ్గర ఎన్ని బైకులున్నాయో! షోరూమ్‌లో కూడా అన్ని ఉండవ్‌..

Show comments