Virat Kohli: కోహ్లీపై స్టార్‌స్పోర్ట్స్‌ స్పెషల్‌ వీడియో చూశారా? ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్‌ పక్కా..!

Star Sports, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ విజయంతో అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికిన విరాట్‌ కోహ్లీపై స్టార్‌ స్పోర్ట్స్‌ అద్భుతమైన సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. ఆ సాంగ్‌ వీడియో గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Star Sports, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ విజయంతో అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికిన విరాట్‌ కోహ్లీపై స్టార్‌ స్పోర్ట్స్‌ అద్భుతమైన సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. ఆ సాంగ్‌ వీడియో గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. యువ క్రికెటర్లకు జట్టులో అవకాశాలు కల్పించేందుకు తాను జట్టుకు దూరం అవుతున్నట్లు.. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన వెంటనే కోహ్లీ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో కోహ్లీ అంత మంచి ఫామ్‌లో లేడు. తొలి మ్యాచ్‌ నుంచి విఫలం అవుతూ వచ్చాడు. కానీ, ఎంతో కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం తన అనుభవం అంతా ఉపయోగించి.. అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు మంచి స్కోర్‌ అందించి.. కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

కోహ్లీ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో.. అతని టీ20 కెరీర్‌కు సంబంధించిన బెస్ట్‌ మూమెంట్స్‌తో ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ స్పెషల్‌ మీడియాను రిలీజ్‌ చేసింది. కోహ్లీపై ఒక ప్రత్యేక సాంగ్‌తో పాటు అదిరిపోయే విజువల్స్‌తో ఆ వీడియో క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక విరాట్‌ కోహ్లీ అభిమానులకైతే.. ఆ వీడియో గుస్‌బమ్స్‌ ఇవ్వడం పక్కా. ఇంకేందుకు ఆలస్యం కిందున్న ఆ వీడియోను మీరూ చూసేయండి. అంతకంటే ముందు కోహ్లీ తన టీ20 కెరీర్‌లో ఏం సాధించాడో తెలుసుకోండి..

తన కెరీర్‌లో ఇప్పటి వరకు 125 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 117 ఇన్నింగ్స్‌ల్లో 4188 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్‌ యావరేజ్‌ 48.7, అలాగే స్ట్రైక్‌రేట్‌ 137.04. అత్యధిక స్కోరు 122. టీ20 కెరీర్‌లో ఒక సెంచరీ, 38 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 369 ఫోర్లు, 124 సిక్సులు కొట్టాడు. బౌలింగ్‌లో కూడా కోహ్లీకి మంచి నంబర్స్‌ ఉన్నాయి. కోహ్లీకి టీ20ల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఘనత కూడా ఉంది. మొత్తంగా ఒక అద్భుతమైన టీ20 కెరీర్‌కు.. టీ20 వరల్డ్‌ కప్‌ విజయంతో కోహ్లీ ముగింపు పలికాడు. మరి కోహ్లీ టీ20 కెరీర్‌తో పాటు స్టార్‌ స్పోర్ట్స్‌ రిలీజ్‌ చేసిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments