నోరుపారేసుకున్న లంక బౌలర్‌! ఒక్క సిరీస్‌ విజయానికే ఇంత అహంకారమా?

నోరుపారేసుకున్న లంక బౌలర్‌! ఒక్క సిరీస్‌ విజయానికే ఇంత అహంకారమా?

Maheesh Theekshana, IND vs SL: టీమిండియా వన్డే సిరీస్‌ విజయం తర్వాత.. ఓ లంక బౌలర్‌ భారత ఆటగాళ్లపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆ బౌలర్‌ ఎవరు? ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Maheesh Theekshana, IND vs SL: టీమిండియా వన్డే సిరీస్‌ విజయం తర్వాత.. ఓ లంక బౌలర్‌ భారత ఆటగాళ్లపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆ బౌలర్‌ ఎవరు? ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాపై మూడు వన్డేల సిరీస్‌ గెలిచిన తర్వాత.. శ్రీలంక ఆటగాళ్లు కొంతమంది భూమ్మీద ఆగడం లేదు. సొంతగడ్డపై ఓ రెండు మ్యాచ్‌ల్లో ఇండియాను ఓడించగానే.. పెద్ద పెద్ద స్టేమ్‌మెంట్లు ఇస్తున్నారు. తాజాగా శ్రీలంక స్పిన్నర్‌ మహీష్‌ తీక్షణ చాలా పెద్ద కామెంట్‌ చేశాడు. తీక్షణ మాట్లాడుతూ.. ‘టీమిండియా క్రికెటర్లు బ్యాటింగ్‌ అనుకూలించే పిచ్‌లపైనే ఎక్కువగా ఆడుతుంటారు, ఇండియాలో అలాంటి పిచ్‌లే ఉంటాయని, పైగా అక్కడి బౌండరీలు కూడా చాలా చిన్నవి ఉంటాయి. కానీ, ప్రేమదాస స్టేడియంలో బాల్‌ టర్న్‌ అవుతుంది, దాన్ని మేం అడ్వాంటేజ్‌గా ఉపయోగించుకున్నాం’ అంటూ తెలిపాడు.

ఈ కామెంట్స్‌పై కొంతమంది భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. స్పిన్‌ను ఆడటం టీమిండియా క్రికెటర్లకు కొత్తేం కాదని.. ఏదో రెండు మ్యాచ్‌లు ఓడిపోగానే, స్పిన్‌తో టీమిండియాను కొట్టేశాం అని ఎక్కువ సంబురపడిపోవడం సరికాదన అంటున్నారు. స్పిన్‌ బౌలింగ్‌లో అంత తోపులు అయి ఉంటే.. మరి టీ20 సిరీస్‌ను 3-0తో ఎందుకు ఓడిపోయారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ వన్డే సిరీస్‌కు కచ్చితంగా టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని శపథాలు చేస్తున్నారు ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌.

అయితే. శ్రీలంకలోని కొలంబో పిచ్‌పై భారత క్రికెటర్లు స్పిన్‌ బౌలింగ్‌ను తడబడిన మాట వాస్తవమే అయినా.. ఈ వన్డే సిరీస్‌లో టాస్‌ చాలా కీలకంగా మారింది. మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా టాస్‌ ఓడిపోవడం కూడా ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. టాస్‌ గెలిచిన శ్రీలంక మూడు మ్యాచ్‌ల్లోనూ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుని.. పిచ్‌ పరిస్థితులను అనుకూలంగా మల్చుకుంది. ఒక వేళ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి ఉంటే.. కచ్చితంగా రిజల్ట్‌ వేరేలా ఉండేదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఇండియాపై మూడు వన్డేల సిరీస్‌ గెలిచిన తర్వాత.. లంక బౌలర్‌ మహీష్‌ తీక్షణ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments