వసీమ్ అక్రమ్ కూడా వేయని బాల్ ఇది! నిన్న మ్యాచ్​లో నటరాజన్ చేసిన అద్భుతం!

సన్​రైజర్స్ హైదరాబాద్ స్పీడ్​స్టర్ నటరాజన్ మ్యాజికల్ డెలివరీతో మెరిశాడు. పేస్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా వేయలేని బాల్ అది.

సన్​రైజర్స్ హైదరాబాద్ స్పీడ్​స్టర్ నటరాజన్ మ్యాజికల్ డెలివరీతో మెరిశాడు. పేస్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా వేయలేని బాల్ అది.

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో అందర్నీ వణికించిన సన్​రైజర్స్ హైదరాబాద్.. సెకండాఫ్​లో కాస్త డీలా పడింది. గత వారంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. తిరిగి మూమెంటమ్​ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న కమిన్స్ సేన.. రాజస్థాన్ రాయల్స్​పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్​తో నిన్న జరిగిన మ్యాచ్​లో ఆరెంజ్ ఆర్మీ 1 పరుగు తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్​కు దిగిన ఎస్​ఆర్​హెచ్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఆర్ఆర్ 20 ఓవర్లకు 200 పరుగులే చేయగలిగింది. చివరి బంతికి ఎస్​ఆర్​హెచ్​ నెగ్గింది. అయితే ఈ మ్యాచ్​ అంతా ఒకెత్తయితే నటరాజన్ వేసిన ఓ మ్యాజికల్ డెలివరీ మరొకెత్తు అనే చెప్పాలి.

సన్​రైజర్స్ సంధించిన 201 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ తడబడింది. స్కోరు బోర్డు మీదకు రెండు పరుగులు కూడా చేరకుండానే 2 వికెట్లు కోల్పోయింది. జాస్ బట్లర్​తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ డకౌట్​గా వెనుదిగిరారు. దీంతో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 67) ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. సూపర్ టచ్​లో ఉన్న రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77)తో కలసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీళ్లిద్దరూ ఆడుతున్నప్పుడు రాజస్థాన్ విజయం నల్లేరు మీద నడకలాగే అనిపించింది. అయితే జైస్వాల్​ను నటరాజన్ ఔట్ చేయడంతో మ్యాచ్​పై క్రమంగా ఎస్​ఆర్​హెచ్ పట్టుబిగించడం మొదలైంది. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ, ఆఖర్లో మరింత టైట్ బౌలింగ్​తో మ్యాచ్​ను కైవసం చేసుకుంది. అయితే అన్నింటి కంటే కూడా జైస్వాల్​ను నటరాజన్ ఔట్ చేసిన తీరు హైలైట్​గా నిలిచింది.

జోరు మీదున్న జైస్వాల్​ ఎవరు బౌలింగ్​కు వచ్చినా అటాక్ చేస్తూ బౌండరీలు, సిక్సులు బాదుతూ పోయాడు. దీంతో నటరాజన్ చేతికి బంతిని ఇచ్చాడు ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్ కమిన్స్. బాధ్యత తీసుకున్న నటరాజన్ ఓ మైండ్​బ్లోయింగ్ డెలివరీతో అతడ్ని పెవిలియన్​కు దారి చూపించాడు. జైస్వాల్ వికెట్లను వదిలి ఆడుతుండటంతో స్టంప్స్​కు దూరంగా బంతిని వేశాడు నటరాజన్. తక్కువ ఎత్తులో దూసుకొచ్చిన ఆ యార్కర్​ను ఎలా ఆడాలో తెలియక స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు జైస్వాల్. అయితే మెరుపు వేగంతో దూసుకొచ్చిన బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. ఈ బాల్​పై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. పేస్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా ఇలాంటి బంతిని వేసి ఉండడని కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజంగా మ్యాజికల్ డెలివరీ అని నట్టూను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. క్రికెట్ హిస్టరీలో ఇదో బెస్ట్ బాల్ అని పొగుడుతున్నారు. మరి.. నట్టూ యార్కర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments