అతడు ఉన్నంత వరకు SRHను ఎవ్వరూ ఆపలేరు.. సౌతాఫ్రికా లెజెండ్ కామెంట్స్!

సన్​రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్​ క్వాలిఫికేషన్​కు దగ్గర్లో ఉంది. నెక్స్ట్ ఆడే రెండు మ్యాచుల్లో ఒక్కదాంట్లో నెగ్గినా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది.

సన్​రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్​ క్వాలిఫికేషన్​కు దగ్గర్లో ఉంది. నెక్స్ట్ ఆడే రెండు మ్యాచుల్లో ఒక్కదాంట్లో నెగ్గినా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది.

సన్​రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్​ క్వాలిఫికేషన్​కు దగ్గర్లో ఉంది. నెక్స్ట్ ఆడే రెండు మ్యాచుల్లో ఒక్కదాంట్లో నెగ్గినా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. సీజన్ ఫస్టాఫ్​లో అదరగొట్టింది ఆరెంజ్ ఆర్మీ. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లకు ఓ రేంజ్​లో పోయించింది. భారీ స్కోర్లు బాదుతూ సన్​రైజర్స్ బ్యాటర్లు అపోజిషన్ బౌలర్లను వణికించారు. అయితే మధ్యలో మూమెంటమ్ దెబ్బతింది. గాడిన పడేందుకు ఎక్కువ టైమ్ తీసుకోవడంతో వరుస పరాజయాలు పలకరించాయి. అయితే ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ ఎక్కిన కమిన్స్ సేన.. 12 మ్యాచుల్లో 7 విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్​ దిశగా పరుగులు తీస్తోంది. ఈ సమయంలో సౌతాఫ్రికా లెజెండ్ షాన్ పొలాక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడుతోందని మెచ్చుకున్నాడు పొలాక్. ఆ టీమ్​కు తిరుగులేదని అన్నాడు. ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్ ట్రావిస్​ హెడ్​ మీద అతడు ప్రశంసల జల్లులు కురిపించాడు. హెడ్​ను ఎలా ఆపాలో ఎవ్వరికీ తెలియడం లేదన్నాడు. ఆరెంజ్ ఆర్మీని ఓడించాలంటే ముందు హెడ్​ను దాటాలన్నాడు పొలాక్. అతడు ఉన్నంత వరకు ఎస్​ఆర్​హెచ్​ను ఆపడం ఎవ్వరి వల్లా కాదని స్పష్టం చేశాడు. ‘ట్రావిస్ హెడ్​ ఇదే రీతిలో ఆడితే సన్​రైజర్స్​ను ఆపడం కష్టమే. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎలా బౌలింగ్ చేస్తున్నా బాదుతుండటంతో అతడి బారి నుంచి ఎలా తప్పించుకోవాలో బౌలర్లకు అర్థం కావడం లేదు. అతడు వాళ్ల పాలిట సింహస్వప్నంగా మారాడు’ అని పొలాక్ పేర్కొన్నాడు.

సన్​రైజర్స్ ప్లేఆఫ్స్ వెళ్లడం పక్కా అని పొలాక్ అన్నాడు. హెడ్ ఉన్నంత వరకు ఆ టీమ్​కు తిరుగులేదన్నాడు. ట్రావిస్ బ్రేకుల్లేని ట్రైన్​లా దూసుకుపోతున్నాడని.. క్రీజులోకి వచ్చాడా బాదడమే పనిగా బ్యాటింగ్ చేస్తున్నాడని తెలిపాడు. బౌలర్లకు అతడు నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో పరిచయం చేస్తున్నాడని పేర్కొన్నాడు. హెడ్ ఆడే సమయంలో అతడి బ్యాట్​ను బీట్ చేసినా, ఇతర విధాలుగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినా ప్రయోజనం ఉండట్లేదని.. బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా అతడి ఊచకోత నుంచి తప్పించుకోలేక పోతున్నారని పొలాక్ వివరించాడు. హెడ్​కు బౌలింగ్ చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. మరి.. ఎస్​ఆర్​హెచ్​కు హెడ్ కప్పు అందిస్తాడని మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments