Nidhan
T Natarajan Visits His School: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఐపీఎల్‌తో పాటు టీమిండియా తరఫున కూడా ఆడటంతో అతడికి మంచి పాపులారిటీ వచ్చింది. అలాంటోడికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది.
T Natarajan Visits His School: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఐపీఎల్‌తో పాటు టీమిండియా తరఫున కూడా ఆడటంతో అతడికి మంచి పాపులారిటీ వచ్చింది. అలాంటోడికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది.
Nidhan
ఎవరి జీవితమైనా స్కూలు నుంచే మొదలవుతుంది. టీచర్లు నేర్పే జీవిత పాఠాలే స్టూడెంట్స్‌ను బలంగా మారుస్తాయి. అందుకే ఎంత సక్సెస్ అయిన వారు కూడా తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయుల్ని, స్కూలును మర్చిపోరు. అయితే ఒకప్పుడు ఏ స్కూలులోనైతే విద్యార్థిగా ఉండి చదువు నేర్చుకున్నారో.. అదే స్కూలుకు చీఫ్ గెస్ట్‌గా హాజరు కావడం మాత్రం అందరి విషయంలో జరగదు. జీవితంలో అత్యున్నత దశకు చేరుకున్న వారికి తప్పితే ఈ గౌరవం అందరికీ దక్కదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌స్టర్ నటరాజన్‌కు ఇది లభించింది. తాను పాఠాలు నేర్చుకున్న స్కూలుకు ముఖ్య అతిథిగా అతడు హాజరయ్యాడు.
నటరాజన్ తాను చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకున్న పాఠశాలను తాజాగా సందర్శించాడు. సేలం, చిన్నప్పంపట్టిలోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూలుకు స్పెషల్ గెస్ట్‌గా విచ్చేశాడీ టీమిండియా క్రికెటర్. ఆ స్కూలులో తాను చదువుకున్న రోజులు, చిన్నప్పటి తన జ్ఞాపకాలను అతడు నెమరేసుకున్నాడు. 33 ఏళ్ల ఈ సీనియర్ పేసర్.. అక్కడి పిల్లలతో కలసి ఫొటోలు దిగాడు. తాను ఎక్కడైతే మొదలుపెట్టానో అక్కడికి వచ్చినందుకు గౌరవంగా ఉందన్నాడు నటరాజన్. ఈ స్కూలు తన ఇల్లు లాంటిదని, ఇక్కడికి రావడం ఎంతో గర్వంగా ఉందన్నాడు. ప్రత్యేక అతిథిగా తనను పిలిచినందుకు స్కూలు యాజమాన్యానికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను తిరిగి మోసుకెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడీ ఎస్ఆర్హెచ్ స్టార్.
ఎవ్వరి లైఫ్ అయినా స్కూలు నుంచే మొదలవుతుంది. అలాగే నటరాజన్ కూడా ఓ ప్రభుత్వ పాఠశాల నుంచే తన కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ఏదో సరదాగా బౌలింగ్ చేసేటోడు ఆ తర్వాత క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని అంచెలంచెలుగా ఎదిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ ఛాన్స్ రావడంతో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఎస్ఆర్హెచ్ తరఫున అదరగొట్టడంతో నేమ్, ఫేమ్ వచ్చాయి. ఎప్పుడూ చూడనంత డబ్బు కూడా వచ్చింది. అలాగే భారత జట్టులోకి ఆడే అవకాశం దక్కింది. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ కొన్నాళ్ల పాటు అతడు అదరగొట్టాడు. ఆ తర్వాత గాయాలు వెంబడించడం, మునుపటి రేంజ్లో బౌలింగ్ చేయలేకపోవడం, టీమ్‌లో కాంపిటీషన్ తీవ్రమవడంతో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. అయినా ఐపీఎల్లో మాత్రం ఇంకా ఆడుతూ ఎస్ఆర్హెచ్ బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. అలాంటోడు తనకు చదువు నేర్పిన స్కూలుకే గెస్ట్‌గా వెళ్లే ఛాన్స్ రావడంతో అక్కడకు వెళ్లి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. కష్టపడితే తనలాగే అందరూ డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవచ్చని అక్కడి పిల్లల్లో స్ఫూర్తి నింపాడు.