iDreamPost
android-app
ios-app

సౌతాఫ్రికాలోనూ ‘హనుమాన్‌’ క్రేజ్‌! స్టార్‌ క్రికెటర్‌ ట్వీట్‌

  • Published Jan 14, 2024 | 4:22 PM Updated Updated Jan 14, 2024 | 4:22 PM

తెలుగులోనే కాదు హిందీలోనూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న హనుమాన్‌ మూవీ క్రేజ్‌ ఖండాంతరాలు దాటి.. సౌతాఫ్రికాకు కూడా వ్యాపించింది. ఏకంగా ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌ హనుమాన్‌ సినిమాలోని ఫొటోను పోస్ట్‌ చేయడం విశేషం. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగులోనే కాదు హిందీలోనూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న హనుమాన్‌ మూవీ క్రేజ్‌ ఖండాంతరాలు దాటి.. సౌతాఫ్రికాకు కూడా వ్యాపించింది. ఏకంగా ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌ హనుమాన్‌ సినిమాలోని ఫొటోను పోస్ట్‌ చేయడం విశేషం. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 14, 2024 | 4:22 PMUpdated Jan 14, 2024 | 4:22 PM
సౌతాఫ్రికాలోనూ ‘హనుమాన్‌’ క్రేజ్‌! స్టార్‌ క్రికెటర్‌ ట్వీట్‌

సంక్రాంతి బరిలోకి గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాతో పోటీ గెలిచిన సినిమా హనుమాన్‌. యువ హీరో తేజ సజ్జా, యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా రిలీజ్‌కి ముందు భారీ హైప్‌ను అందుకుంది. మహేష్‌ బాబు హీరోగా, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా భారీ అంచనాల నడుమ.. సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ నెల 12న విడుదలైంది. సాధారణ మహేష్‌ బాబు లాంటి పెద్ద హీరో సినిమాతో చిన్న హీరోల సినిమా పోటీ పడటం అంటే సాహసమే చెప్పాలి. కానీ, కథలో దమ్ము, కంటెంట్‌లో క్వాలిటీ ఉండటంతో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ చాలా ధైర్యంగా సంక్రాంతి బరిలో నిలిచాడు. అయితే.. మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో వారి ధైర్యానికి ఫలితం దక్కుతోంది.

ఇప్పటికే మంచి కలెక్షన్లతో హనుమాన్‌ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో విజుల్‌ వండర్‌గా హనుమాన్‌కు తెరకెక్కించడంతో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. ఈ సినిమా రేంజ్‌ ఇండియాను దాటిపోయింది. ఇండియా తర్వాత తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే అమెరికాలో కూడా మన సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. కానీ, సౌతాఫ్రికాలో మన సినిమాలకు ఆదరణ ఉండదు. కానీ, ఇప్పుడు హనుమాన్‌ పుణ్యమా అని అక్కడ కూడా హనుమాన్‌ గురించి చిన్న చర్చ నడుస్తోంది. అది ఎలాగంటే..

సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ కేశవ్‌ మహారాజ్‌ తాజాగా హనుమాన్‌ సినిమాలోని హనుమాన్‌ విగ్రహాన్ని తన ట్వీట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా హనుమాన్‌ సినిమా గురించి అక్కడ కూడా టాక్‌ నడుస్తోంది. భారత సంతతికి చెందిన కేశవ్‌ మహారాజ్‌ హనుమంతుడికి పరమ భక్తుడు. ఇప్పుడు హనుమంతుడిపై ఇంత మంచి సినిమా రావడంతో అతను సైతం ఈ సినిమాకు తన వంత మద్దతును ఈ విధంగా అందించాడనే చెప్పాలి. అయితే.. సినిమా పేరు కానీ, డైరెక్టర్‌ పేరు కానీ, కేశవ్‌ పేర్కొనలేదు. త్వరలో వారిని కూడా కేశవ్‌ గుర్తిస్తాడని తెలుగు క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి సౌతాఫ్రికా క్రికెటర్‌ కేశవ్‌ మహరాజ్‌ హనుమాన్‌ సినిమాలోని హనుమంతుడి ఫొటోను పోస్ట్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss