iDreamPost
android-app
ios-app

ప్రియురాలిని పెళ్లాడిన విధ్వంసకర బ్యాటర్.. ఫొటోలు వైరల్

  • Published Mar 11, 2024 | 7:39 AM Updated Updated Mar 11, 2024 | 7:39 AM

వరల్డ్ క్రికెట్ లో డాషింగ్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్న ఓ స్టార్ క్రికెటర్ తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు పెట్టాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడాడు ఈ స్టార్ ప్లేయర్.

వరల్డ్ క్రికెట్ లో డాషింగ్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్న ఓ స్టార్ క్రికెటర్ తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు పెట్టాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడాడు ఈ స్టార్ ప్లేయర్.

ప్రియురాలిని పెళ్లాడిన విధ్వంసకర బ్యాటర్.. ఫొటోలు వైరల్

ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్ గా పేరుతెచ్చుకున్న స్టార్ ప్లేయర్ ఓ ఇంటివాడైయ్యాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడాడు. గతేడాది బీచ్ లో రింగ్ ఇచ్చి వెరైటీగా ప్రపోచేశాడు ఈ ఆటగాడు. అతడి ప్రేమకు ముగ్దురాలు అయిన ఆమె ఓకే చెప్పేసింది. అప్పటి నుంచి ప్రేమ పక్షుల్లా విహరించిన ఈ జంట తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రేయసి అయిన కామిలా హారిస్ ను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను హారిస్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో సహచర క్రికెటర్లతో పాటుగా అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. మిల్లర్ వైట్ బాల్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అందుకే అభిమానులు అతడిని ముద్దుగా ‘మిల్లర్ కిల్లర్’ అని పిలుచుకుంటారు. ఐపీఎల్ లో పలు టీమ్స్ కు ఆడిన మిల్లర్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కెరీర్ లో 173 వన్డేలు ఆడి 4458 పరుగులు చేశాడు. 116 టీ20ల్లో 2270 రన్స్ సాధించాడు. ఇక ఐపీఎల్ లో 121 మ్యాచ్ లు ఆడిన మిల్లర్ ఓ సెంచరీతో 2714 పరుగులు చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by 𝑪𝒂𝒎𝒊𝒍𝒍𝒂 𝑯𝒂𝒓𝒓𝒊𝒔 (@camillaharris__)

ఇదికూడా చదవండి: సిక్స్ ప్యాక్​తో టీమిండియా డాషింగ్ బ్యాటర్.. గుర్తుపట్టండి చూద్దాం!